Ambani: అంబాని, అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర ఇళ్లకు బాంబులు పెట్టి పేల్చేస్తాం, హై అలర్ట్ ?
ముబాయిలో మరో ఉగ్రదాడి జరుగుతుందని హెచ్చరికలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు ముంబాయి నగరంలోకి అడుగుపెట్టారని పోలీసులకు సమాచారం అందింది.
ముంబాయి: దేశ ఆర్థిక రాజధాని ముంబాయి నగరాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకోవడం కొత్త కాదు. మాఫియా డాన్ ల నుంచి ఇప్పుడు ఉగ్రవాదుల వరకు ముంబాయి నగరాన్ని టార్గెట్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్ కు చెందిన కసబ్ గ్యాంగ్ ముంబాయిలో చేసిన అరచకాలు మరిచిపోవడం కొన్ని వేల సంవత్సరాల వరకు ఏమాత్రం సాధ్యం కాదు.
అలాంటి ముంబాయి నగరంలోని ప్రముఖులకు, సినీ తారల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ బాద్ షాతో పాటు మరో పముఖ హీరోతో పాటు దేశంలోని టాప్ టెన్ వ్యాపారుల జాబితాలో ముందు వరసులో ఉన్న అంబాని ఇంటికి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.

ముబాయి నగరంలో మరో ఉగ్రదాడి జరుగుతుందని హెచ్చరికలు రావడంతో ఆ సిటీలోని పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. భారీ ఆయుధాలతో ఉగ్రవాదులు ముంబాయి నగరంలోకి అడుగుపెట్టారని సమాచారం అందడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దేశంలోనే ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బచ్చన్, మరో బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఇళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులకు ఈ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే నాగ్‌పూర్ పోలీసులు ముంబాయి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముంబాయి నరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ ఈ కాల్ వచ్చిన ఐపిఎ చిరునామా, నిందితుల ఆచూకి తెలుసుకోవడానికి రంగంలోకి దిగారు.
ఇటీవల ముకేష్ అంబానీ ఇంటిని పేల్చేస్తామంటూ ముంబాయి, నాగ్‌పూర్ పోలీసులకు తప్పుడు బెదిరింపు కాల్స్ వచ్చాయి.
ముంబాయిలో బాంబు పేలుళ్లు చేస్తామని ఇంతకు ముందు చాలాసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం ముంబాయి పోలీసులు చాలా సీరియస్ గా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ముంబాయి పోలీసులు మాత్రం ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications