శ్రీవల్లీ సాంగ్ లో అలా.. నా జీవితంలో మొదటిసారి చూశాను: అమితాబ్ బచ్చన్!!
సుకుమార్ దర్శకత్వంలోని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనపై బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల కాలంలో అనేక విషయాలపైన స్పందిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తాజాగా రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియోపైన కూడా తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటి వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇక తాజాగా మరోమారు రష్మిక మందన్నా నటించిన పుష్ప సినిమా శ్రీవల్లి సినిమా పాటపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా 'పుష్ప'. ఈ చిత్రం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని శ్రీవల్లీ పాట గురించి బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమానికి హాజరైన భువనేశ్వర్ కి చెందిన ఇప్సితా దాస్ ను 20వేలరూపాయల ప్రశ్నగా 2023లో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు పొందిన గ్రహీత ఎవరు అని ప్రశ్నించారు. దానికి ఆయన అల్లు అర్జున్ అని సమాధానం చెప్పారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ నటనపైన, ఆ సినిమాలోని శ్రీవల్లి పాటపైన వ్యాఖ్యలు చేసిన అమితాబ్ బచ్చన్ ''పుష్ప' నిజంగా అద్భుతమైన సినిమా అంటూ కొనియాడారు.
అందులో శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించిందని ఆయన పేర్కొన్నారు. చెప్పు వదిలేసినా.. ఆ స్టెప్పు వైరల్ కావడం నా జీవితంలో మొదటిసారి చూశాను అంటూ శ్రీవల్లి పాటకు కితాబిచ్చారు. ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారు''అని, ఆ స్టెప్పు ఎంతగా వైరల్ అయిందో అందరూ చూశారని తెలిపారు. మొత్తంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్, రష్మిక మందన్న దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఏకంగా బిగ్ బి అమితాబచ్చన్ వాళ్ళని పొగడ్తలతో ముంచెత్తడం అందుకు నిదర్శనం. .












Click it and Unblock the Notifications