Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమితాబ్, జయ, అభిషేక్‌లకు రూ.50వేల పింఛను

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ఆయన సతీమణి జయ, వారి కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు ఇకపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నెలకు రూ. 50వేల పింఛను అందజేయనుంది. ఆశ్చర్యం కలిగించే విషయమైన ఇది నిజం. ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందించే యాశ్ భారతి అవార్డులు స్వీకరించిన వారందరికీ ఈ మేరకు పింఛను అందజేయనున్నట్లు ప్రకటించింది.

ఈ అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. అయితే, అమితాబ్ తన కుటుంబానికి వచ్చే పింఛను మొత్తాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి ఉపయోగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు. దీనిపై సిఎం అఖిలేష్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు.

కాగా, కళా, సాంస్కృతిక, క్రీడా, సాహిత్యం, వైద్య, జర్నలిజం, సామాజిక సేవ రంగాల్లో ప్రముఖులకు ఈ అవార్డులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది.

సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వ హయాంలో అవార్డు అందుకున్న వారందరికీ జీవితకాలంపాటు ఈ మేరకు పింఛను అందజేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. అయితే గతంలో సమాజ్ వాది పార్టీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన సమయంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ రాష్ట్ర అత్యున్నత రాష్ట్ర పురస్కారాన్ని రద్దు చేసింది.

 Amitabh Bachchan, Jaya, Abhishek to get monthly pension of Rs 50, 000?

‘యాశ్ భారతి అవార్డు అందుకున్న వారందరికీ జీవితకాలంపాటు రూ. 50వేలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది' అని కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తెలిపారు.

కాగా, దేశంలో ఏ ఇతర అవార్డుకు లభించని విధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అవార్డు అందుకున్న వారికి భారీ మొత్తంలో పింఛను రూపంలో చెల్లించడం గమనార్హం. ఇది స్వాతంత్ర్య సమరయోధులు, ప్రభుత్వ అధికారులు అందుకుంటున్న పింఛనుకంటే మించి ఉండటం విశేషం.

1994లో ప్రారంభించిన ఈ అవార్డును ఇప్పటివరకు వివిధ రంగాలకు చెందిన సుమారు 150మంది ప్రముఖులు అందుకున్నారు. అవార్డు ప్రారంభమైన సంవత్సరంలోనే అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ బచ్చన్ సాహిత్యంలో ఈ అవార్డును అందుకున్నారు.

ఈ ఏడాది ప్రథమార్థంలో అఖిలేష్ ప్రభుత్వం కళా, సాహిత్య రంగాల్లోని 56మంది ప్రముఖులకు ఈ అవార్డుతో సత్కరించింది. ఈ అవార్డు పొందిన వారిలో నటులు నవాజుద్దీన్ సిద్దిఖీ, జిమ్మీ సెర్గిల్, గాయకుడు కైలాశ్ ఖేర్, రేఖా భరద్వాజ్, క్లాసికల్ ఒకాలిస్ట్ పండిట్ రజన్, సజన్ మిశ్రాలు ఉన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+