ఐటీఐ అబ్బాయి, 8వ తరగతి అమ్మాయి, ఆకర్షణ లేదా ప్రేమా, కాలేజ్ నుంచి వెళ్లి పొలంలో ఏం చేశారంటే ?
పక్కపక్క గ్రామాల్లో నివాసం ఉంటున్న అమ్మాయికి, అబ్బాయికి పరిచయం అయ్యింది. తెలిసితెలియని వయసులో ఇద్దరూ ఆకర్షణకు లోనయ్యారు. అయితే ఇద్దరూ ప్రేమలోపడటంతో అక్కడ కథ మలుపు తిరిగింది. ఇద్దరూ మైనర్లు కావడంతో వాళ్లు మాట్లాడుకుంటున్న విషయం వారి కుటుంబ సభ్యులకు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు.
అయితే మైనర్ లవర్స్ విషం సేవించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని చిత్తాపుర సమీపంలోని కోల్లూపుర గ్రామంలో రాధిక (14) అనే అమ్మాయి నివాసం ఉంటున్నది. చిత్తాపురలోని ఓ స్కూల్ లో రాధిక 8వ తరగతి చదువుతోంది, కోల్లూపుర గ్రామం సమీపంలోని మరో గ్రామంలో ఆకాష్ (17) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిత్తాపురలోని ఐటీఐ కాలేజ్ లో ఆకాష్ ఐటీఐ చదువుతున్నాడు.

ఆకాష్, రాధిక ప్రతిరోజు మాట్లాడుకుంటూ కలిసిమెలసి తిరుగుతున్నా అమ్మాయి కుటుంబ సభ్యులకు ఎలాంటి డౌట్ రాలేదు. అయితే ప్రేమలో పడిన రాధిక, ఆకాష్ సాయంత్రం బయట తిరుగుతూ ఆలస్యంగా ఇంటికి రావడం మొదలుపెట్టారని తెలిసింది. స్కూల్ నుంచి ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు అంటూ వారం రోజుల క్రితం రాధికను ఆమె కుటుంబ సభ్యులు మందలించారని తెలిసింది.

అయితే మైనర్ ప్రేమికులు ఆకాష్, రాధికల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని పోలీసులు తెలిపారు. మైనర్లు ఆకాష్, రాధికల ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, వారి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, కేసు విచారణలో ఉందని గురువారం చిత్తాపుర పోలీసులు తెలిపారు. తెలిసితెలియని వయసులో ఇద్దరు మైనర్లు ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications