ఎయిర్ అంబులెన్స్ లో మంటలు: పైలెట్ మృతి, డాక్టర్లకు !

బ్యాంకాక్: మేదాంత ఆసుపత్రికి చెందిన ఎయిర్ అంబులెన్స్ విమానంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించి పైలెట్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఐదు మంది ప్రయాణిస్తున ఎయిర్ అంబులెన్స్ ను అత్యవసరంగా కిందకు దించివేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైనాయి.

విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సోషల్ మీడియాలో ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ కు మేధాంత ఆసుపత్రి ఎయిర్ అంబులెన్స్ బయలుదేరింది. మార్గం మధ్యలో కోల్ కతాలో ఎయిర్ ఆంబులెన్స్ కు ఇంధనం నింపారు.

తరువాత ఎయిర్ అంబులెన్స్ బ్యాంకాక్ బయలుదేరింది. మార్గం మధ్యలో ఎయిర్ అంబులెన్స్ లో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి. వెంటనే నఖమ్ పాథమ్ విమానాశ్రయంలో ఎయిర్ అంబులెన్స్ ను ఆకస్మికంగా కిందకుదించేశారు.

 An Air Ambulance of Medanta Hospital with a five member crew crash landed after it caught fire near Bangkok.

అయితే అప్పటికే మంటలు వ్యాపించడంతో పైలెట్ అరుణాక్ష నంది సంఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రగాయాలైన డాక్టర్ శైలేంద్ర, డాక్టర్ కోమల్ లను బ్యాంకాక్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ తీవ్రగాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో మరో నర్సుకు గాయాలు కావడంతో ఆమెకు అక్కడే చికిత్స అందిస్తున్నారని సుష్మా స్వరాజ్ ట్వీట్టర్ లో తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన పైలెట్ కుటుంబ సభ్యులకు సుష్మా స్వరాజ్ ప్రగాడసానుభూతి తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+