మాజీ మంత్రిపై హత్యాయత్నం: సీరియస్
పాట్నా: మాజీ మంత్రి మీద బలమైన ఆయుధంతో దాడి చేసిన సంఘటన బీహార్ రాజధాని పాట్నాలో జరిగింది. తీవ్రగాయాలైన మంత్రి ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని పాట్నా సీనియర్ పోలీసు అధికారి వికాస్ వైభవ్ చెప్పారు. ఈ సంఘటనతో పాట్నాలో ఉద్రిక్త పరిస్థితి ఎర్పడింది.
మాజీ మంత్రి ఏజాజ్-ఉల్-హక్ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాఘవేంద్ర సింగ్ ను బోజ్ పూర్ లో అరెస్టు చేసి ఎస్ యువీ వాహనం, లైసెన్స్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
చాల సంవత్సరాల నుండి ఆర్ జేడీకి చెందిన ఏజాజ్-ఉల్-హక్ కు కొంత మందితో పాతకక్షలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. పాట్నాలోని అషినా నగర్ లోని రాయల్ కోర్ట్ అపార్ట్ మెంట్ మూడవ అంతస్తులో ఏజాజ్ నివాసం ఉంటున్నారు.

శుక్రవారం రాత్రి రాఘవేంద్ర సింగ్ ఏజాజ్ నివాసం ఉంటున్న ప్లాట్ లోకి వెళ్లాడు. తరువాత ఇద్దరు కుర్చుని మాట్లాడుకుంటున్నారు. తరువాత సింగ్ బలమైన ఆయుధం తీసుకుని ఏజాజ్ మీద దాడి చేసి ఆయన రివ్వాలర్ లాక్కొని అక్కడి నుండి పరారైనాడని పోలీసు అధికారులు అంటున్నారు.
గతంలో లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార రబ్రీ దేవి ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో రెండు సార్లు ఏజాజ్ మంత్రిగా పని చేశాడు. రానున్న ఎన్నికలలో పోటి చెయ్యడానికి ఇప్పటి నుండి అన్ని సిద్దం చేసుకుంటున్నాడు. ఇదే సమయంలో ఏజాజ్ మీద హత్యాయత్నం జరిగింది.












Click it and Unblock the Notifications