వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదిలించిన రవి భార్య కుసుమ రోదనలు, వీడ్కోలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నిజాయితీ గల ఐఏఎస్ అధికారి అనుమానస్పద మృతి కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఆన్ లైన్ లో అర్జీ సమర్పించారు. పలువురు దగ్గర సంతకాలు చేయించి ఆన్ లైన్ లో అర్జి సమర్పించారు. రవి మృతి కేసును సిబిఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని సోషల్ మీడియా ద్వారా రవి అభిమానులు ప్రధాని మోడీకి మనవి చేశారు

ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పిన బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం. ఎన్. రెడ్డిని వెంటనే ఆ పదవి నుండి తప్పించాలని రవి అభిమానులు డిమాండ్ చేశారు. రవి మరణానికి కారణమైన వారిని గుర్తించి ఉరి తియ్యాలని డిమాండ్ చేశారు.

ఎంతో కష్టకాలంలో రవి ధైర్యంగా ఉన్నారని, అలాంటిది ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మడానికి తాము సిద్దంగా లేమని కోలారు, చిక్కబళ్లాపురం జిల్లా ప్రజలు అంటున్నారు.

ప్రజల అధికారి

ప్రజల అధికారి

డికె రవి ఎంతటి నిజాయితీ కలిగిన అధికారి అనే విషయం అంతిమ దర్శనానికి వచ్చిన ఈ ప్రజలే సాక్ష్యం. బెంగళూరులోని నాగరబావి సమీపంలోని అంబేద్కర్ కాలేజ్ దగ్గర రవి పార్థివ శరీరం పెట్టారు.

నివాళులు అర్పించిన స్వామీజీలు

నివాళులు అర్పించిన స్వామీజీలు

ఆదిచుంచనగిరి మఠాధిపతి శ్రీ నిర్మాలనంద స్వామిజీ రవి పార్థివ శరీరానికి నివాళులు అర్పించారు.

తరలి వచ్చిన అభిమానులు

తరలి వచ్చిన అభిమానులు

నాగరబావి దగ్గర రవి పార్థివ శరీరాన్ని పెట్టారని తెలుసుకున్న అభిమానులు వేలాధి మంది ఒక్క సారిగా రావడంతో తోక్కిసలాట జరిగింది. పోలీసులు గట్టి బందోబస్తు ఎర్పాటు చేశారు.

ఒక్క అవకాశం ఇవ్వండి

ఒక్క అవకాశం ఇవ్వండి

కడసారి రవి ని చూడటానికి కోలారు, చిక్కబళ్లాపురం ప్రజలు పోటి పడ్డారు. ఒకానొక సందర్భంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

ఫోటోలు తియ్యందండి ఫ్లీజ్

ఫోటోలు తియ్యందండి ఫ్లీజ్

రవి భార్య కుసుమ ఆర్తనాదాలు అక్కడ ఉన్నవారిని చలించి వేసింది. ఆ సందర్బంలో మీడియా సభ్యులు ఫోటోలు తియ్యడానికి ప్రయత్నించారు. దయచేసి ఫోటోలు తియ్యరాదని కుసుమ వేడుకున్నారు.

తరలి వచ్చిన మహిళలు.... నాయకులు

తరలి వచ్చిన మహిళలు.... నాయకులు

శాసన సభ్యుడు ప్రియా క్రిష్ణతో పాటు స్థానిక కార్పొరేటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వెచ్చి రవికి నివాళులు అర్పించారు.

తరలి వచ్చిన అన్నదాతలు

తరలి వచ్చిన అన్నదాతలు

చిక్కబళ్లాపురం, కోలారు జిల్లా నుండి పెద్ద సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. 14 నెలలలో రవి సార్ మాకు చేసిన సహాయం గురించి పలువురికి చెప్పారు.

జిల్లా ఉన్నంత వరకు మీరు ఉంటారు

జిల్లా ఉన్నంత వరకు మీరు ఉంటారు

కోలారు జిల్లా ఉన్నంత వరకు అక్కడి ప్రజల గుండెలలో శాస్వతంగా ఉంటారని అక్కడి ప్రజలు అన్నారు.

English summary
Additional commissioner in the commercial taxes department D.K Ravi died in suspicious way, who was found dead in his apartment under mysterious circumstances. The last rites on Tuesday held at his native place Tumakuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X