Crime News: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఇంట్లోనే పూడ్చిపెట్టింది.. 4 సంవత్సరాల తర్వాత..
ఢిల్లీలో ఓ యువకుడు ప్రియురాలిని హత్య చేసి అనంతరం మృతదేహాన్ని 35 ముక్కులుగా చేసి పలు ప్రాంతాల్లో పడేసిన ఘటన మరవక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో జరిగింది. చంద్రవీర్ అనే వ్యక్తిని అతని భార్య ప్రియుడితో కలిసి హత్య చేసింది. మృతదేహాన్ని ఇంట్లో పాతి పెట్టింది. దాదాపు 4 సంవత్సరాల తర్వాత ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివాహేతర సంబంధం
ఘజియాబాద్‌కు చెందిన చంద్రవీర్, సవిత దంపతులు. సవితకు పక్కింట్లో ఉండే అరుణ్ తో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం భర్త తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో భర్తను అంతమొందించాలని నిర్ణయించుకున్న సవిత ప్రియుడు అరుణ్ తో కలిసి ప్లాన్ చేసింది. సెప్టెంబర్ 28, 2018న చంద్రవీర్ అర్థరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు.

ఆరడుగుల గొయ్యి
వెంటనే సవిత అరుణ్‌ను ఇంట్లోకి పిలిపించింది. చంద్రవీర్ గదిలోకి వెళ్లిన అరుణ్ చంద్రవీర్ తలపై కాల్చి చంపాడు. అనంతరం అతని మృతదేహాన్ని ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు అరుణ్. అరుణ్ ఇంట్లోసవిత సాయంతో ఆరడుగుల గొయ్యి తవ్వి అందులో చంద్రవీర్ మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. పై నుంచి ఫ్లోరింగ్ కూడా చేశారు. కొద్ది రోజుల తర్వాత తన భర్త చంద్రవీర్ సింగ్ కనిపించకుండాపోయాడని సవిత ఘజియాబాద్‌లోని సిహానీ గేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

2017 నుంచి
నాలుగు సంవత్సరాల తరువాత ఇటీవల ఈ కేసులోఘజియాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులకు కొన్ని ఆధారాలు లభ్యమవ్వడంతో మళ్లీ విచారణ ప్రారంభించినట్లు ఎస్పీ దిక్ష శర్మ తెలిపారు. ఈ క్రమంలోనే మృతుడి భార్య సవిత, ప్రియుడు అరుణ్ అలియాస్ అనిల్ కుమార్ కలిసి చంద్రవీర్‌ను హత్య చేసినట్లు వెల్లడైంది. ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించగా తమ నేరాన్ని అంగీకరించారు. 2017 నుంచి తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఈ విషయం భర్తకు తెలియడంతో తరుచూ గొడవలు జరిగేవని భార్య సవిత తెలిపింది. మరోసారి ఇలా జరగవద్దని పలుమార్లు హెచ్చరించాడని పేర్కొంది. ఇక ఈ కేసులో నిందితులైన సవిత, అరుణ్‌ను కోర్టులో హజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications