Manipur Violence: మణిపూర్‍లో మరో ఘోరం.. వృద్ధురాలిని సజీవదహనం చేసిన నిరసనకారులు..
మణిపూర్ లో మరో దారుణం జరిగింది. కొద్దిరోజుల క్రితం ఇద్దరు గిరిజన మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై యవత్ దేశం స్పందించింది. కేంద్ర కూడా నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించింది. మహిళలను నగ్నంగా ఊరేగించిన ప్రాంతానికి సరిగ్గా 40 కిలో మీటర్ల దూరంలో అదే రోజున (మే 4)న ఈ సామూహిక అత్యాచారం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలు మరవకముందే.. కక్చింగ్ జిల్లా సెరౌ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఇంట్లోనే సజీవ దహనం చేశారు.
ఈ దారుణ ఘటన మే 28న తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఒకప్పుడు, రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన గ్రామం, ఇప్పుడు హింస మరియు కాల్పులతో దద్దరిల్లింది. మహిళ భర్త ఎస్ చురచంద్ సింగ్ ఫ్రీడం ఫైటర్. ఆయన 80 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన్ను మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం సన్మానం కూడే చాశారు. ఇందుకు సంబంధించి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

లోయ-మెజారిటీ మెయిటీస్, కొండ-మెజారిటీ కుకీ తెగల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో సెరౌ అత్యంత దెబ్బతిన్న గ్రామాలలో ఒకటిగా ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు భార్య 80 ఏళ్ల ఇబెటాంబ్ ను ఇంట్లో ఉంచి బయట నుంచి తాళం వేసి ఇంటికి నిప్పు పెట్టారు. షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో మెయిటీ కమ్యూనిటీని చేర్చడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కుకీ, మైతేయ్ సంఘాల నిరసనల నేపథ్యంలో మణిపూర్ లో మే 3 నుంచి హింస కొనసాగుతోంది.
మణిపూర్ లో హింసను కట్టడి చేయడంలో సీఎం బీరేన్ సింగ్ విఫలమయ్యారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మణిపూర్ భద్రత బలగాలను భారీ సంఖ్యలో మోహరిస్తున్న హింసాత్మక ఘటనలు మాత్రం ఆగడం లేదు. మణిపూర్ హింసకు మయన్మార్ నుంచి వస్తున్న మత్తు మందే కారణమని కొందరు చెబుతున్నారు. ఆ మత్తు మందు తీసుకుని ఇష్టమొచ్చినట్ల ప్రవర్తిస్తున్నారు వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications