రైతుకు షోరూంలో అవమానం: ఇంటికెళ్లి బొలెరో డెలివరీ, వెల్‌కం అంటూ ఆనంద్ మహీంద్రా
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని ఓ మహీంద్రా షోరూంలో రైతుకు జరిగిన అవమానం ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై మహీంద్ర సంస్థల ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించడంతో కథ సుఖాంతం అయ్యింది. అవమానం ఎదుర్కొ రైతు ఇంటికే ఆయన కోరిన బొలెరో పికప్ ట్రక్కును డెలివరీ చేసింది సంస్థ. అంతేగాక, క్షమాపణలు కూడా తెలిపింది.
Recommended Video

రైతు కెంపెగౌడకు స్వాగతం అంటూ ఆనంద్ మహీంద్ర
ఈ
డెలివరీపై
అంతకుముందే
మహీంద్రా
ఆటోమోటివ్
ట్వీట్
చేసింది.
జనవరి
21న
మహీంద్రా
షోరూంలో
రైతు
కెంపెగౌడ,
ఆయన
స్నేహితులకు
కలిగిన
అసౌకర్యానికి
చింతిస్తున్నాం.
ఇచ్చిన
మాటకు
కట్టుబడి
తగిన
చర్యలు
తీసుకున్నాం.
సమస్య
ఇప్పుడు
పరిష్కారమైంది.
మా
వాహనాన్ని
ఎంచుకున్నందుకు
కెంపెగౌడకు
ధన్యవాదాలు.
మహీంద్రా
కుటుంబంలోకి
స్వాగతం
అంటూ
ట్విట్టర్
వేదికగా
మహీంద్రా
ఆటోమోటివ్
పేర్కొంది.
దీన్ని
రీట్వీట్
చేస్తూ
ఆనంద్
మహీంద్రా
స్పందించారు.
ఆ
రైతుకు
ఆనంద్
మహీంద్రా
కూడా
తమ
సంస్థ
ఫ్యామిలీలోకి
స్వాగతం
పలికారు.

మహీంద్రా షోరూంలో రైతుకు అవమానం
బొలెరో
పికప్
వాహనాన్ని
కొనేందుకు
రైతు
కెంపెగౌడ
జనవరి
21న
తుమకూరులోని
మహీంద్రా
షోరూంకి
వెళ్లాడు.
అయితే,
రైతును
అక్కడి
సేల్స్‌మెన్
అవమానించాడు.
ఆ
కారు
ధర
రూ.
10
లక్షలు
ఉంటుందని..
నీ
దగ్గర
రూ.
10
రూపాయలు
కూడా
ఉండవంటూ
రైతు
ఆహార్యాన్ని
చూసి
వెళ్లిపోవాలంటూ
హేళన
చేశాడు.
దీంతో
వారిద్దరి
మధ్య
వాగ్వాదం
జరిగింది.
ఆ
సేల్స్‌మెన్‌కు
బుద్ధి
చెప్పేందుకు
ఓ
గంటలోనే
రూ.
10
లక్షలతో
మళ్లీ
షోరూంకి
వెళ్ళాడు.
తనకు
వాహనం
తక్షణమే
డెలివరీ
కావాలని
కోరాడు.
దీంతో
సేల్స్‌మెన్
ఖంగుతిన్నాడు.
వెయిటింగ్
లిస్ట్
ఉందని,
వాహనాన్ని
వెంటనే
డెలివరీ
చేయలేమని
సిబ్బంది
తెలిపారు.
అయితే,
తమతో
దురుసుగా
మాట్లాడిన
సేల్స్‌మెన్
క్షమాపణ
చెప్పాలని
డిమాండ్
చేశారు.
అందుకు
అతడు
నిరాకరించడంతో
ఈ
గొడవ
పోలీసుల
వరకూ
వెళ్లింది.
పోలీసులు
ఆ
సేల్స్‌మెన్‌తో
క్షమాపణలు
చెప్పించారు.
ఇలాంటి అవమానం ఎవరికీ జరగొద్దంటూ రైతు కెంపెగౌడ ఆనందం
కాగా, ఈ వీడియోను కొందరు ఆనంద్ మహీంద్రను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారుదీంతో ఈ వివాదంపై ట్విట్టర్ వేదికగా ఆనంద్ మహీంద్ర స్పందించారు. దీనిపై ఆనంద్ మహీంద్ర తాజాగా స్పందించారు. 'మా కంపెనీ ప్రధాన ఉద్దేశం.. అన్ని వర్గాల వారిని అభివృద్ధి చేయడమే. వ్యక్తుల మర్యాదను కాపాడటం మా ప్రధానమైన నైతిక విలువ. ఈ సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై చర్యలు ఉంటాయి' అని మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే చివరకు షోరూం మహీంద్రా బొలెరో పికప్ ట్రక్కును అందజేయడంతో సమస్య సుఖాంతమైంది. ఈ నేపథ్యంలో రైతు కెంపెగౌడ స్పందించారు. ఇలాంటి అవమానం ఎవరికీ జరగకూడదనే తాను కోరుకుంటున్నానని, వాహనన్నీ సమయానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని రైతు కంపెగౌడ ఆనందం వ్యక్తం చేశారు.