మానవత్వానికి అర్ధం చెప్తున్న అనంత్ అంబానీ!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ప్రముఖ బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ గా వన్యప్రాణుల రక్షణ కోసం, వాటికి పునరావాసాన్ని కల్పించడం కోసం సామాజిక బాధ్యతగా జామ్ నగర్ లోని వంతారా ద్వారా తన మానవత్వాన్ని చాటుకున్న విషయం తెలిసిందే.
వన్య ప్రాణుల పట్ల ప్రేమ కనబరిచే అనంత్ అంబానీ
వన్యప్రాణులకు సంబంధించి విశాలమైన రక్షణ మరియు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దానిని మానవుల వల్ల గాయపడిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా మార్చారు. వన్యప్రాణుల పరిరక్షణ యొక్క తక్షణ అవసరాన్ని ఆయన తన చర్యల ద్వారా చాటారు. అనంత్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ గానే కాకుండా, సామాజిక బాధ్యత పట్ల నిబద్ధతకు కట్టుబడి పని చేసే వ్యక్తి.

ద్వారకకు కాలినడకన అనంత్ అంబానీ
ప్రస్తుతం ఆయన మరోమారు తన మానవత్వాన్ని చాటుకుని అందరి దృష్టిలో నిలిచారు. అనంత్ అంబానీ ఏప్రిల్ 10వ తేదీన తన పుట్టినరోజు నాటికి ద్వారకకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే గుజరాత్ లోని జామ్ నగర్ నుంచి ద్వారకకు పాదయాత్రగా ఆయన వెళ్తున్నారు. ఈ రెండు నగరాల మధ్య 140 కిలోమీటర్ల దూరం ఆయన కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. ఏప్రిల్ 10వ తేదీన తన పుట్టినరోజు నాటికి అనంత్ అంబానీ ద్వారకకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
250 chickens. Crammed in a truck. On their way to slaughter. 💔
— Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) April 1, 2025
But then, Anant Ambani steps in. He stops the truck, talks to the owner, pays the price, and saves them all. These 250 souls are now safe and will be cared for at VANTARA. ❤️
On his way to Dwarka for his 30th… pic.twitter.com/PMOSQWgG1k
కోళ్ళ వ్యాన్ చూసి చలించిపోయిన అనంత్ అంబానీ
అయితే పగలు కాలినడకన ప్రయాణం చేస్తే తన కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అన్న ఉద్దేశంతో, భారీ భద్రత మధ్య రాత్రి వేళ అనంత్ అంబానీ పాదయాత్ర చేస్తున్నారు. ఇక ఆయన తన పాదయాత్రలో తన గొప్ప మనసును చాటుకున్నారు. పాదయాత్ర చేస్తున్న అనంత్ అంబానీ కంభాలియా ప్రాంతంలో ఒక కోళ్ల వ్యాన్ ను చూసి చలించిపోయారు.
గొప్ప మనసు చాటుకున్న అనంత్ అంబానీ
ఆ కోళ్ళ వ్యాన్ నుండి ఒక కోడి క్రింద పడటంతో దానిని చూసి వెంటనే ఆ కోడిని కాపాడారు. అనంత్ అంబానీ తన గొప్ప మనసును చాటుకున్నారు. కోళ్ల వ్యాన్ లో బంధించిన కోళ్లను అన్నింటిని వదిలేయాలని, రెండు రెట్లు డబ్బులు చెల్లిస్తానని యజమానికి తెలిపారు. అనంత్ అంబానీ జంతు సంక్షేమం పట్ల లోతైన నిబద్ధతకు ఈ ఘటన అద్దం పడుతుంది.
కోళ్ళను కాపాడిన అనంత్ అంబానీ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా అనంత్ అంబానీ జంతువుల పట్ల చూపించే ప్రేమకు ఫిదా అవుతున్నారు. రెండింతలు అదనపు డబ్బు చెల్లిస్తానని చెప్పిన అనంత్ అంబానీ కోళ్ల వ్యాన్ లోని అన్ని కోళ్లను విడుదల చేసి యజమానికి పరిహారం చెల్లించారు. అలాగే వదిలేయబడిన కోళ్ళ సంరక్షణకు కట్టుబడ్డారు.
తోటి ప్రాణుల పట్ల అనంత్ అంబానీ కరుణ
ఇక ఏప్రిల్ 10వ తేదీన పుట్టినరోజు సందర్భంగా జామ్ నగర్ నుంచి ద్వారక వరకు అనంత అంబానీ సాగిస్తున్న పాదయాత్రలో ఆయన ప్రయాణం మానవత్వం, సహజీవనం తో కూడుకుని ఉన్నదని, తోటి ప్రాణుల పట్ల కరుణను ప్రదర్శిస్తుందని ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే ద్వారకకు కాలినడకన బయలుదేరిన అనంత అంబానీ ప్రతిరోజు రాత్రి వేళల్లో 15 నుండి 20 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు.
వంతారా ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం ఇదే
మొత్తం 12 రోజులపాటు ప్రయాణం చేసి తన పుట్టినరోజు నాడు ద్వారకాధీశుని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే అనంత్ అంబానీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వంతారా వన్యప్రాణుల సంరక్షణ ప్రాజెక్టు గురించి చాలా విశేషాలు ఉన్నాయి. గుజరాత్లోని జామ్ నగర్ లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ద్వారా నిరాశ్రయులైన, అంతరించిపోతున్న జంతువులకు తిరిగి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో ఆయన ఈ ప్రాజెక్టును మొదలుపెట్టారు.
వంతారాలో 2వేల జంతువులకు రక్షణ
జంతువుల ప్రశాంతత నుంచి జీవిత పాఠాలు నేర్చుకునే అవకాశం కలుగుతుందని, మాట్లాడకుండానే అవి మనసులోని ఎన్నో భావాలను వ్యక్తం చేస్తాయని ఈ ప్రాజెక్టు విషయంలో అనంత్ అంబానీ చెబుతారు. జంతువుల పై జరుగుతున్న దాడులు, మానవ జోక్యం, వేట వంటి సమస్యలను అరికట్టి వాటికి రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశమని. మొత్తం 2000 జంతువులకు ఇక్కడ ఆశ్రయం కల్పించినట్టు చెబుతారు.
వంతారా ప్రాజెక్ట్ కు వారే స్ఫూర్తి అన్న అనంత్ అంబానీ
ఈ ప్రాజెక్టు ద్వారా పర్యావరణ పరిరక్షణకు కూడా అనంత్ అంబానీ ఇస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుంది. జామ్ నగర్ ను పచ్చదనంతో నింపిన తన తాత ధీరుభాయి అంబానీ, ఇక ప్రపంచంలోనే అతిపెద్ద శుద్ధి కర్మాగారాన్ని స్థాపించిన తండ్రి ముఖేష్ అంబానీ ల స్ఫూర్తితో తాను వంతారా ప్రాజెక్టును మొదలు పెట్టానని చెప్పే అనంత్ అంబానీ పర్యావరణ పరిరక్షణ కోసం వన్యప్రాణుల సంరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన తన జీవితంలో అడుగడుగునా తన సంకల్పాన్ని మరచిపోకుండా ప్రయాణం సాగిస్తున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications