వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే గొడుకు కిందకు 6పార్టీలు: జనతా పరివార్ చీఫ్‌గా ములాయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాత జనతాదళ్ పక్షాలు ఒక్కటయ్యాయి! నిన్నటి వరకు కొట్టుకున్న పార్టీలన్నీ ఇప్పుడు జనతా పరివార్‌గా ఒకే ఛత్రం కిందకు వచ్చాయి. జనతా పరివార్ కొత్త పార్టీలో ఆరు పార్టీలు విలీనం అయ్యాయి. ఈ ఆరు పార్టీలతో కలిసి జనతా పరివార్‌ను స్థాపించారు. దీనికి అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ ఉంటారు.

ఈ విషయమై జనతా పరివార్ నాయకులు బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జనతా పరివార్‌కు ములాయం నాయకత్వం వహిస్తారని చెప్పారు. జనతా పరివార్‌లో విలీనానికి భాగస్వామ్య పక్షాలు అంగీకరించాయని చెప్పారు. మతతత్వ శక్తులను ఓడించేందుకే తాము విలీనమయ్యామని చెప్పారు.

 Mulayam Singh Yadav

జనతా పార్టీ తరఫున పార్లమెంటరీ తరఫున ములాయం నేతగా ఉంటారు. నూతన రాజకీయ పార్టీ దేశానికి కొత్త దిశను చూపిస్తుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.

విలీనమైన పార్టీలు

జనతా పరివార్‌లో విలీనమైన పార్టీలు.. సమాజ్ వాది, ఆర్జేడీ, జేడీయు, జేడీఎస్, ఐఎన్ఎల్డీ, ఎస్‌జేపీ

ఐదుగురి సభ్యుల కమిటీ

ఆరు పార్టీల విలీనంతో ఏర్పడిన జనతా పార్టీ... జెండా, అజెండా కోసం ఐదుగురు సభ్యుల కమిటీని నియమించారు. పార్టీ జెండాను, ఎన్నికల గుర్తును ఐదుగుర సభ్యుల కమిటీ ఖరారు చేయనుంది. కాగా, ములాయం సింగ్ నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ములాయం, లాలూ, నితీష్, దేవేగౌడ తదితరులు హాజరయ్యారు.

English summary
The name of party, symbol and flag will be decided after taking into consideration views of presidents of all 6 parties: Sharad Yadav
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X