వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోడో టెర్రరిస్టుల పని: అస్సాంలో ఆంధ్ర ఇంజనీర్ కిడ్నాప్

By Pratap
|
Google Oneindia TeluguNews

Andhra engineer abducted by Bodo terrorists
ఒంగోలు: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంజనీర్ బండ్లమూడి నాగ మల్లేశ్వరరావు (36)ను విడిచిపెట్టాలంటే రూ.6 కోట్లు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అసోంలోని హఫ్లాంగ్ సమీపాన బోడో తీవ్రవాదులుగా భావి స్తున్నవారు ఆరు రోజుల కిందట ఆయనను కిడ్నాప్ చేశారు.

అయితే, ఇది స్థానిక ముఠాల దుశ్చర్యేనని, తీవ్రవాదుల ప్రమేయం లేదని భావిస్తున్నట్లు దిమా హసావో జిల్లా ఎస్పీ వేదాంత రాజ్‌ఖోవా ఆదివారం చెప్పారు. అలాగే ఆయన విడుదలకు కిడ్నాపర్లు భారీగా డబ్బు డిమాండ్ చేశారన్న వార్తలో వాస్తవాలు తేలాల్సి ఉందని అసోం ఏడీజీపీ అజిత్ ప్రసాద్ రౌత్ చెప్పారు.

ఇంజనీర్‌ను రక్షించేందుకు తమతోపాటు సైన్యం కూడా రంగంలో దిగిందన్నారు. ప్రస్తుతం ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. కాగా, కిడ్నాప్‌కు గురైన ఇంజనీర్ ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం కె.వి.పాలెం నివాసి. ఆయన ఏపీకి చెందిన వశిష్ట కన్‌స్ట్రక్షన్స్ సంస్థలో రాళ్లు పగులగొట్టే యూనిట్ మేనేజర్‌గా అక్కడ పనిచేస్తున్నారు.

ఆయనను సురక్షితంగా విడిపించే దిశగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఐవైఆర్ కృష్ణారావు అసోం సీఎస్‌తో మాట్లాడారు. నాగమల్లేశ్వర రావును సురక్షితంగా విడిపిస్తామని కంపెనీ అధికారులు కుటుంబ సభ్యులకు హామీ ఇస్తున్నారు.

English summary

 An engineer from Andhra Pradesh was kidnapped in Maribaon district of Assam reportedly by Bodo militants who have demanded Rs 6 crore for his release. Though he was abducted on June 17, it came to light only on Sunday when his family received intimation from the firm where he is employed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X