లదాక్‌లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు

జమ్మూకాశ్మీర్ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గుతుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, అనూహ్య విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉన్న లదాక్ లో తెలుగు జవాన్ ఒకరు దుర్మణం చెందారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..

జమ్మూ కశ్మీర్‌ లో అత్యంత కీలకమైన లదాక్ జిల్లాలో లైలా ప్రాంతం వద్ద ఆర్మీ వాహనం బోల్తా పడిన ఘటనలో ప్రాణనష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలగుంట్లకు చెందిన జవాన్ శివ గంగాధర్ (28) లదాక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు స్థానికులు, జిల్లా పోలీసులు తెలిపారు.

andhra jawan from kurnool dist has killed when army vehicle overturned in Ladakh

జవాన్ శివగంగాధర్‌కు మూడు నెలల క్రితమే వివాహం జరిగింది. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్చేందుకు స్థానిక పోలీసులు.. ఆర్మీ అధికారులతో మాట్లాడారని, ఇప్పటికే కర్నూలు జిల్లా పోలీసులు.. ఆర్మీ జవాన్ శివ గంగాధర్‌ మృతదేహం స్వాధీనం చేసుకున్నారని, సోమవారం నాటికి జిల్లాకు తిరిగొచ్చేస్తారని తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+