రాష్ట్రపతి పాలనపై సింఘ్వీ: వారంలో సిఎం? రేస్‌లో ఆనం

Pranab Mukherjee
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పాలన అనేది వివిధ రాష్ట్రాల్లో తరచూ జరిగేదేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ బుధవారం అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కాంగ్రెస్ పార్టీ మొగ్గుచూపుతోందా? లేక తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు వేర్వేరు ముఖ్యమంత్రుల్ని ఎంపిక చేస్తుందా? అని ప్రశ్నించగా ఇలాంటి నిర్ణయాలు విలేకరుల సమావేశాల్లో తీసుకునేవి కాదన్నారు.

తెలంగాణను ఇంకా రాజ్యసభ ఆమోదించాల్సి ఉందన్నారు. ఈ నిర్ణయాలను కేంద్ర కేబినెట్ సిఫారసు మేరకు రాష్ట్రపతి తీసుకుంటారని, ఇవి ఆయన పరిధిలో ఉన్న విషయాలన్నారు. ఇలాంటివి వివిధ రాష్ట్రాల్లో తరచూ జరుగుతూనే ఉంటాయని, ఈ ప్రక్రియలో భాగంగా తీసుకోవాల్సిన రాజ్యాంగపరమైన నిర్ణయాలను రాజ్యాంగ స్ఫూర్తితోనే తీసుకుంటామన్నారు. రాష్ట్ర పాలన, యంత్రాంగంలో ఎలాంటి సమన్వయం లోపించకుండా, ఇబ్బందులకు గురికాకుండా చేయటమే రాజ్యాంగం, రాజకీయాల్లోని మౌలిక అంశమన్నారు.

మరోవైపు, రాష్ట్రానికి నాలుగో కృష్ణుడు వస్తారా, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెడతారా అనే విషయమై జోరుగా చర్చ సాగుతోంది. దీనికి తోడు, మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, సీమాంధ్ర నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడం మంచిదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందని తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్రపతి పాలన విధించే అంశాన్నీ పరిశీలిస్తోందని సమాచారం. సిఎం రేసులో చిరు, బొత్స, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి తదితరులు ఉన్నారు.

గురువారం ఉదయం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కిరణ్ రాజీనామా చేసినా గవర్నర్ నుంచి నివేదిక రావడం ఆలస్యం కావడంతో కేంద్ర కేబినెట్ సమావేశాన్ని గురువారానికి వాయిదా వేశారు. రాష్ట్రపతి పాలన విధించాలంటే దానికి పార్లమెంటు ఆమోదం కావాలి. శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి. గురువారం ఉదయం కేంద్ర కేబినెట్ తీసుకుంటే గురు, శుక్రవారాల్లోనే రాష్ట్రపతి పాలనకు ఆమోదం పొందాల్సి ఉంటుంది.

పార్లమెంటు ఆమోదం పొందితే ఆరు నెలల వరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉంటుంది. తద్వారా, ఎన్నికల వరకు ఢోకా ఉండదు. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసినా ఇటువంటి ఇబ్బందులూ ఎదురు కావన్నది అధిష్ఠానం అంచనాగా చెబుతున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలను నిర్వహించాలా లేక అసెంబ్లీ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించి డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలా అన్న విషయాన్ని తేల్చుకోలేక కేంద్రం సతమతమవుతోంది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశముందంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+