ఆంధ్రప్రదేశ్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ

చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలుగు దేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు.

హైదరాబాద్‌లో ఉన్న పవన్, హైదరాబాద్లోనే ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం 11.40 ప్రాంతంలో పవన్ బాబు ఇంటికి చేరుకున్నారు.

ఆంధ్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తిగా మారింది.

గతంలో విశాఖపట్నంలో పవన్ పర్యటనపై ఆంక్షలు విధించినప్పుడు పవన్‌ను చంద్రబాబు కలసి తన సంఘీభావం ప్రకటించారు.

తాజాగా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో పవన్ చంద్రబాబుకు తన సంఘీభావాన్ని ప్రకటించడానికి కలిశారని రెండు పార్టీల వర్గాలూ చెబుతున్నాయి.

చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఏం చర్చించబోతున్నారు?

తెలంగాణలో పోటీ, ఆంధ్రలో భవిష్యత్తు ప్రణాళిక అంశాలపై వారు చర్చించనున్నారు.

జగన్ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ఇప్పటికే తన వైఖరి స్పష్టం చేశారు పవన్.

ప్రస్తుతం బీజేపీతో ఉన్న పవన్, తనకు బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్టు గతంలో చెప్పారు కూడా.

ఈ పరిస్థితుల్లో తాజా సమావేశంపై ఆసక్తి పెరిగింది.

(నోట్: ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+