'బిగ్ సినిమాస్'ను అమ్మేసిన అనిల్ అంబానీ..
ముంబై: 'అడాగ్' కంపెనీల అధినేత అనిల్ అంబానీ తన గ్రూపులోని 'బిగ్ సినిమాస్'ను దక్షిణ భారతానికి చెందిన 'కార్నివాల్'కు విక్రయించారు. రిలయన్స్ కేపిటల్ రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనిల్ అంబానీకి రూ.700 కోట్ల మేర భారం తప్పనుంది.
బిగ్ సినిమాస్ పేరిట చిత్ర నిర్మాణ రంగంలోకి దిగిన అనిల్ అంబానీ అందులో ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ క్రమంలో బిగ్ సినిమాస్‌ను దక్షిణ భారతానికి చెందిన 'కార్నివాల్' కు ఆయన విక్రయించారు. రిలయన్స్ క్యాపిటల్ సీఈఓ శ్యామ్ ఘోష్ మాట్లాడుతూ "ప్రధాన ఆర్ధిక సేవల వ్యాపారంపై దృష్టి పెట్టడమే మా లక్ష్యం. మాకు కీలకం కాని మీడియా, వినోద రంగాల్లో పెట్టబడులను తగ్గించుకోవడం ద్వారా మొత్తం మీద అప్పులను పరితమిత స్ధాయికి తీసుకురావాలనుకుంటున్నాం" అని పేర్కొన్నారు.

ఈ మేరకు రిలయన్స్ కేపిటల్, కార్నివాల్‌ల మధ్య కుదిరిన ఒప్పందానికి నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉంది. అన్ని అనుమతులను త్వరితగతిన పొంది, ఈ ఏడాది ముగిసేలోగానే ఈ డీల్ ను పూర్తి చేయాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటిదాకా జరిగిన ఖరీదైన ఒప్పందాల్లో ఇదే పెద్దది.
ఈ తాజా నిర్ణయంతో 300 తెరలతో కార్నివాల్ దేశంలోనే అతి పెద్ద మూడో మల్టీప్లెక్స్ ఆపరేటర్ కానుంది. తొలి రెండు స్ధానాల్లో పీవీఆర్, ఐనాక్స్‌లు ఉన్నాయి. రిలయన్స్ మీడియా వర్క్స్ మాతృసంస్ధ అయిన రిలయన్స్ క్యాపిటల్ దేశంలో బిగ్ సినిమాస్ బ్రాండ్‌తో 250కు పైగా తెరలున్నాయి. 2017 కల్లా 1000 తెరలను చేరుకోవాలన్నదే తమ లక్ష్యమని కార్నివాల్ గ్రూపు ఛైర్మన్ శ్రీకాంత్ భాసి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications