వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసియా అందాల రాణిగా యూపీకి చెందిన టీచర్.. అందానికి కొత్త అర్ధం చెప్పిన అంజులా నారంగ్!!

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టీచర్ అపురూపమైన అందాలరాణి కిరీటాన్ని కైవసం చేసుకుంది. టీచర్ ఏంటి అందాల రాణి కిరీటం ఏంటి? అని ఆశ్చర్యంగా ఉందా? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ఈ టీచర్.. ఒక కొడుక్కు తల్లిగా ఉండి కూడా అందాల రాణి అనిపించుకున్న ఈ టీచర్ కథనం మీ కోసమే..

ఆసియా అందాల రాణిగా బరేలీకి చెందిన టీచర్

ఆసియా అందాల రాణిగా బరేలీకి చెందిన టీచర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలి నగరానికి చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ అంజుల నారంగ్ ఆసియా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ పేజెంట్ 2023 మిస్సెస్ విభాగంలో అందాల రాణిగా కిరీటాన్ని దక్కించుకుంది. అస్సాం రాష్ట్రానికి చెందిన కిరణ్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ పోటీ ఇటీవల ఇండోనేషియా బాలిలో జరిగింది. ఈ పోటీలో కిరీటాన్ని గెలుచుకోవాలన్న ఆశతో ఆసియా ఖండంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అనేక మంది పోటీదారులు, ఒకరిని మించి ఒకరు పోటీ పడ్డారు. అందరినీ ఓడించిన యూపీ టీచర్ చివరకు ఆసియా అందాల పోటీలో విజేతగా నిలిచారు.

ఆసియా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ 2023 అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ ఆమె సొంతం

ఆసియా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ 2023 అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ ఆమె సొంతం

ఈ సందర్భంగా మాట్లాడిన అందాల రాణి అయిన టీచర్ అంజుల నారంగ్, తాను బరేలికి చెందిన బిషప్ కాన్రాడ్ స్కూల్లో విద్యాబోధన చేస్తానని, ఈ పోటీ గురించి ఆన్లైన్ ప్రకటన ద్వారా తెలుసుకొని, మిస్సెస్ విభాగంలో టైటిల్ గెలవడానికి అందులో పాల్గొన్నానని పేర్కొన్నారు. చాలా రౌండ్లు పోటీ నిర్వహించిన తర్వాత, తీవ్రమైన కాంపిటీషన్లోనూ తాను ఆసియా వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ 2023 యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన టైటిల్ ను, అందాల రాణి కిరీటాన్ని దక్కించుకున్నానని చెప్పుకొచ్చారు. అంతకు ముందు అనేకసార్లు తాను రాష్ట్రస్థాయిలో అందాల పోటీల్లో విజేతగా నిలిచానన్నారు.

సాధించిన విజయాన్ని కుటుంబానికి అంకితం చేసిన టీచర్

సాధించిన విజయాన్ని కుటుంబానికి అంకితం చేసిన టీచర్

స్థానిక వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న అంజుల నారంగ్ కు ఒక కుమారుడు ఉన్నాడని పేర్కొన్నారు. ఆమె తాను సాధించిన విజయాన్ని తన కుటుంబానికి అంకితం చేస్తున్నట్టు వెల్లడించారు. అందం అంటే కేవలం ముఖం మరియు శారీరక లక్షణాలే కాదని మన హృదయంలో ఉండే వెలుగు అని ఆమె పేర్కొన్నారు. క్రమశిక్షణ, సంకల్పం, ధైర్యంతో మనలోని అందాన్ని ప్రస్పుటం అయ్యేలా ప్రదర్శించడమే గెలుపుకు సంకేతం అన్నారు. అందాల రాణి కిరీటాలు కూడా క్రమశిక్షణ, సంకల్పం, మరియు ధైర్యానికి ప్రతీకగా తయారవుతాయని ఆమె వెల్లడించారు.

English summary
A teacher from UP won the title of Mrs Asian beauty queen. Anjula Narang, who gave a new meaning to beauty, won the title.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X