మరోసారి నిరాహార దీక్షకు సిద్దమైన అన్నాహజారే..!

అవినీతి వ్యతిరేక పోరాటాలతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు పూనుకున్నారు. మహారాష్ట్రలో లోకాయుక్త చట్టం అమలుపై మరోసారి నిరసన చేపట్టనున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 30న తన స్వగ్రామమైన రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం పదే పదే హామీలు ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు లోకాయుక్త చట్టం క్షేత్రస్థాయిలో అమలు కాలేదని తీవ్రంగా విమర్శించారు. ఇదే తన చివరి నిరాహార దీక్షగా ఉండొచ్చని స్పష్టం చేయడంతో.. ఈ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కాగా లోకాయుక్త చట్టం అమలు కోసం హజారే మొదటిసారిగా 2022లో రాలేగావ్‌ సిద్ధిలో నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను విరమించారు. అనంతరం కమిటీని ఏర్పాటు చేసి లోకాయుక్త బిల్లు సిద్ధం చేసి శాసనసభ ఉభయ సభల్లో ఆమోదింపజేశారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన ఈ బిల్లు ఆమోదం పొందినప్పటికీ, ఇప్పటికీ చట్టం కార్యరూపం దాల్చలేదని హజారే అసంతృప్తి వ్యక్తం చేశారు.

anna-hazare-announce-hunger-strike-for-lokayukta-act-in-maharashtra

అంతే కాకుండా మహారాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్త చట్టం అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఏకంగా ఏడు లేఖలు రాసినప్పటికీ ఇప్పటివరకు స్పందన రాలేదని తెలిపారు. ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగానే తాను మళ్లీ నిరాహార దీక్షకు దిగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమానికి అత్యంత కీలకమైన ఈ చట్టం కారణంగా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని, అవినీతి తగ్గిపోతుందని ఆయన స్పష్టం చేశారు.

అవినీతిని అరికట్టడంలో లోకాయుక్త కీలక పాత్ర పోషిస్తుందని, ప్రజల ఫిర్యాదులను నిష్పక్షపాతంగా విచారించి సరైన చర్యలు తీసుకునే స్వతంత్ర వ్యవస్థ ఇది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వం దానిని అమలు చేయడంలో వెనుకంజ వేయడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదని వ్యాఖ్యానించారు. అయితే అన్నా హజారే 2011లో నాటి కేంద్ర ప్రభుత్వంపై జన్ లోకపాల్ బిల్లు అమలుకు భారీ ఉద్యమాన్ని నడిపిన విషయం తెలిసిందే.

ఆ పోరాటం దేశవ్యాప్తంగా కోటానుకోట్ల మంది మద్దతు సాధించింది. ఇప్పుడు చేపట్టబోయే నిరాహార దీక్షకు పలు సామాజిక సంస్థలు, రైతు సంఘాలు, యువజన సంస్థలు మద్దతు ప్రకటించనున్నాయి. హజారే దీక్ష ప్రారంభం అవ్వకముందే ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఏ నిర్ణయానికి వచ్చినా 88 ఏళ్ల వయస్సులో హజారే స్వయంగా నిరాహార దీక్షకు తయారవడం ప్రజల్లో ఆందోళనను కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+