నిన్న దీప్ సిద్ధూ .. నేడు ఇక్బాల్ సింగ్ .. ఎర్రకోట హింస కేసులో మరో నిందితుడు అరెస్ట్
రిపబ్లిక్ డే రోజు అన్నదాతల ఆందోళనలో భాగంగా నిర్వహించిన కిసాన్ పరేడ్ లో, ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న హింస కేసులో మరో నిందితుడు ఇక్బాల్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బుధవారం ఉదయం తెలిపింది. నిన్న రాత్రి పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నుంచి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు.
ఎర్రకోట హింసకు సంబంధించి పలువురు ప్రధాన నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, అప్పటి నుండి వీరి కోసం గాలింపు చేపట్టారు .
రిపబ్లిక్ డే నాడు ఎర్రకోట హింస కేసు ప్రధాన నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్ధూ అరెస్ట్

ఇక్బాల్ సింగ్ ల ఆచూకి చెప్పినవారికి 50 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటన
ఈ కేసులో నిందితులైన సుఖ్ దేవ్ సింగ్, బూటాసింగ్, జజ్బీర్ సింగ్, ఇక్బాల్ సింగ్ ల ఆచూకి చెప్పినవారికి 50 వేల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు
. ప్రధాన నిందితుడు దీప్ సిద్దూ ఆచూకీ చెప్తే లక్ష రూపాయలు రివార్డ్ ఇస్తామని చెప్పారు . నిన్న దీప్ సిద్ధూ ను అరెస్ట్ చెయ్యగా నేడు ఇక్బాల్ సింగ్ ను అరెస్ట్ చేశారు . రిపబ్లిక్ డే రోజున చోటు చేసుకున్న హింసకు సంబంధించిన వీడియోలలో, ఇక్బాల్ సింగ్ ఎర్ర కోట వద్ద విధుల్లో ఉన్న పోలీసులను బెదిరింపులకు గురి చేసినట్లుగా ఉంది.

ఎర్రకోట వద్ద పోలీసులను బెదిరించిన వారిలో ఇక్బాల్ సింగ్
ఇక్బాల్ సింగ్ స్వంత ఆయుధాలతో వారిపై దాడికి దిగుతామని , ఎర్రకోట యొక్క ద్వారాలు శాంతియుతంగా తెరవకపోతే, ఆయుధాలు ఉపయోగిస్తామని, విస్తృతంగా రక్తపాతం జరుగుతుందని ఆయన చెప్పడం కూడా వీడియో లో ఉంది. ఇక ఈ వీడియో ఫేస్‌బుక్‌లో బాగా వైరల్ అయింది.
ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వద్ద హింసకు కారణమైన , రైతుల బృందాన్ని ప్రేరేపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు దీప్ సిద్ధును మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

దీప్ సిద్ధూ కు వారం రోజుల కస్టడీ
ఎర్రకోట హింస వీడియో ఫుటేజీలో సిద్ధూ ప్రధానంగా ఉన్నాడు . అప్పటి నుండి అతను పరారీలో ఉన్నాడు. నిన్న సిద్ధూ అరెస్టు చేసిన పోలీసులు ఆయనను ఏడు రోజుల కస్టడీకి పంపించారు
. ఢిల్లీ పోలీస్ డిసిపి సంజీవ్ యాదవ్ నేతృత్వంలోని ఆపరేషన్‌లో సిద్ధును గుర్తించి అరెస్టు చేశారు. చండీగడ్ సమీపంలోని జిరాక్‌పూర్ లో అతన్ని అరెస్టు చేశారు. సిద్ధూ కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఒక మహిళా స్నేహితురాలితో పరిచయం కలిగి ఉన్నాడు. అతను వీడియోలను తయారు చేసి ఆమెకు పంపించేవాడు, మరియు ఆమె వాటిని తన ఫేస్బుక్ ఖాతాలో అప్లోడ్ చేసేవారని పోలీసులు తెలిపారు.

ఎర్రకోట హింస ఘటనలో చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
కేంద్రం యొక్క మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్ తో జనవరి 26 న, రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా వేలాది మంది రైతులు పోలీసులపై దాడికి దిగారు . చాలా మంది నిరసనకారులు ట్రాక్టర్లను నడుపుతూ హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఎర్రకోటకు చేరుకుని స్మారక చిహ్నంలోకి ప్రవేశించిన ఆందోళనకారులు ఎర్రకోటపై మత జెండాలను మరియు ప్రాకారాల వద్ద ఒక ఫ్లాగ్‌స్టాఫ్‌ను కూడా ఎగురవేశారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం వీరిపై కేసులు నమోదు చేయించి చర్యలకు ఉపక్రమించింది.