ఈ మృగాళ్లను ఏం చేయాలి: అమ్మాయిపై అత్యాచారం చేసి తుపాకీతో కాల్చి చంపి తగలబెట్టారు

బక్సర్ : ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మానవ మృగాలు మాత్రం ఆగడం లేదు. ఒంటరిగా కనిపించిన మగువపై కామంతో తెగబడుతున్నాయి. ఓ వైపు దేశవ్యాప్తంగా దిశా అత్యాచారం, హత్యపై ఆందోళనలు జరుగుచుండగానే మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన కామాంధులు ఒంటరి మహిళలపై కనికరం చూపడం లేదు. రెండు నిమిషాల సుఖం కోసం స్త్రీ మూర్తిపై కర్కశత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నది సామాన్యులే కాదు.. పోలీసులు కూడా కావడం ఆందోళన కలిగిస్తోంది. రక్షకులుగా నిలవాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతుండటంపై సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. ఇందుకు నిదర్శనం తాజాగా ఒడిషాలో జరిగిన ఘటనే. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే బీహార్‌లో మరో బాలికపై అత్యాచారం చేసి ఆ తర్వాత కాల్చి చంపారు కామాంధులు.

 బీహార్‌లో మరో దిశ ఘటన

బీహార్‌లో మరో దిశ ఘటన

హైదరాబాదు శివార్లలో దిశాపై జరిగిన అత్యాచారం హత్యకు సంబంధించిన గాయం ఇంకా మానకముందే ఒడిషాలో మరో మహిళపై దారుణానికి పాల్పడ్డారు కామాంధులు. ఆ తర్వాత బీహార్‌లోని బక్సర్ జిల్లాలో మరో అత్యాచార ఘటన వెలుగుచూసింది. కుకుదా గ్రామంకు చెందిన బాలికను కొందరు దుర్మార్గులు అత్యాచారం చేశాక ఆమెను తుపాకీతో కాల్చారు. అనంతరం ఆమె మృతదేహానికి తగలబెట్టారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. కాలిపోయి ఉన్న బాలిక మృతదేహాన్ని పోలీసులు మంగళవారం ఉదయం ఆరుగంటల సమయంలో స్వాధీనం చేసుకున్నారు.

కాల్పులు అత్యాచారం చేశాక తుపాకీతో కాల్పులు

కాల్పులు అత్యాచారం చేశాక తుపాకీతో కాల్పులు

పోలీసులకు కాలిన మృతదేహం గురించి సమాచారం అందగానే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారని బక్సర్ జిల్లా డిప్యూటీ ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. అయితే అమ్మాయి నడుము భాగం వరకు కాలి ఉందని చెప్పారు. హత్యకు ముందు ఆమెపై దుండగులు అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు చెప్పారు. మృతదేహంను పోస్టుమార్టంకు పంపించామని చెప్పిన పోలీసులు నివేదిక రాగానే మృతురాలు మైనరా లేక మేజరా అనేదాన్ని నిర్ధారిస్తామని చెప్పారు. మృతురాలు తలలో ఒక బుల్లెట్ ఉందని సాక్ష్యం లేకుండా చేయాలని మృతదేహాన్ని కాల్చేశారని పోలీసులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి కార్టిర్డ్జ్‌ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

మృతదేహాన్ని గుర్తుపట్టని గ్రామస్తులు

మృతదేహాన్ని గుర్తుపట్టని గ్రామస్తులు

ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం వందల సంఖ్యలో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అయితే మృతురాలిని గుర్తు పట్టడం ఎవరి వల్ల కాలేదని వెల్లడించారు. ఘటనపై ఎస్పీ స్పందన కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. హైదరాబాద్‌లో దిశాపై జరిగిన అత్యాచారం హత్యతో ఈ ఘటన కూడా పోలి ఉందని పోలీసులు చెప్పారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+