కన్నబిడ్డనే: ఆత్మహత్యపై పోస్టుమార్టంలో దిమ్మతిరిగే వాస్తవం..
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ.. పోస్టుమార్టం రిపోర్టుతో అసలు విషయాలు బయటపడ్డాయి.
చెన్నై: దేశంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో ఎక్కువ శాతం హత్యలు ప్రేమ పెళ్లిళ్లతో ముడిపడి ఉన్నవే. తమ కులం కాని వ్యక్తిని ప్రేమిస్తే తల్లిదండ్రులే కన్నబిడ్డల ప్రాణాలు తీస్తున్నారు.
తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం పరిధిలోని ఓ గ్రామంలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తల్లిదండ్రులే కన్నబిడ్డను హత్య చేశారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ.. పోస్టుమార్టం రిపోర్టుతో అసలు విషయాలు బయటపడ్డాయి. చివరికి ఆ తల్లిదండ్రులు కూడా నిజం ఒప్పుకోక తప్పలేదు.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. తిరుమంగళం సమీపంలోని గ్రామానికి చెందిన జానవేలు, సీతాలక్ష్మీ దంపతులు. వారికి అన్నలక్ష్మీ(16) అనే కుమార్తె ఉంది. ఇటీవల ఉన్నట్టుండి అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగుచూసింది.
పదో తరగతిలో ఫెయిల్ అయినందువల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. కానీ మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించగా దిమ్మతిరిగిపోయే వాస్తవం వెలుగు చూసింది. అన్నలక్ష్మీ ఆత్మహత్య చేసుకోలేదని బలవంతంగా ఆమె మెడకు తాడు బిగించి హత్య చేశారని పోస్ట్ మార్టమ్ నివేదిక చెప్పింది.
పోస్టుమార్టమ్ నివేదిక ఆధారంగా పోలీసులు అన్నలక్ష్మీ తల్లిదండ్రులను విచారించారు. దీంతో కూతురిని తామే హత్య చేశామని వారు ఒప్పుకున్నారు. తమ కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న కోపంతోనే ఆమెను పరువు హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గ్రామంలోని యువకులతో తమ కూతురు తిరగడం తమకు నచ్చలేదని వారు చెప్పినట్లు తెలిపారు. నేరం అంగీకరించడంతో ఆ తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications