కట్టు తప్పుతున్న మంకీపాక్స్: ఆ రాష్ట్రాల్లో కలకలం
న్యూఢిల్లీ: మంకీపాక్స్ పాజిటివ్ కేసులు చాపకింద నీరులా విస్తరించడం మొదలు పెట్టింది. క్రమంగా విజృంభిస్తోంది. ఈ ఒక్కరోజే రెండు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఈ మహమ్మారి తొలి పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చిన కేరళలో మరొకటి నమోదైంది. ఆ కొద్దిసేపటికే దేశ రాజధానిలో మరో కేసు నమోదైంది. దీనితో ఢిల్లీలో ఇప్పటివరకు రికార్డయిన మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య ఎనిమిదిగా నమోదైంది.
దేశ రాజధానిలో ఇవ్వాళ మరొకరు మంకీపాక్స్ బారిన పడ్డారు. ఢిల్లీలో నమోదైన మూడో పారిజిటివ్ కేసు ఇది. ఇదివరకు ఓ నైజీరియన్‌లో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. నాలుగైదు రోజులుగా జ్వరం, దగ్గు, శరీరంపై దద్దుర్లతో బాధపడుతున్న అతనికి వైద్య పరీక్షలను నిర్వహించారు. నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అతనికి మంకీపాక్స్ సోకినట్లు రిపోర్ట్ అందింది. దీనితో అతణ్ని లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేశారు.

ఇప్పుడు కూడా మరో నైజీరియన్‌కే మంకీపాక్స్ సోకింది. దీనితో ఢిల్లీలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరింది. ప్రస్తుతం అతణ్ని ఎల్‌ఎన్‌జేపీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. అతని ఆరోగ్యం బాగుందని పేర్కొన్నారు. అతనికి కూడా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు దేశంలో నమోదైన ఎనిమిది పాజిటివ్ కేసుల్లో అయిదు.. ట్రావెల్ హిస్టరీ ఉన్నవేనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు.
ఈ ఉదయం వరకు దేశంలో నమోదైన మొత్తం మంకీపాక్స్ పాజిటివ్ కేసుల సంఖ్య ఆరు. ఈ మధ్యాహ్నానికి ఎనిమిది చేరింది. కొన్ని గంటల వ్యవధిలో కేరళ, ఢిల్లీల్లో కొత్తగా కేసులు నమోదు కావడం బెంబేలెత్తిస్తోంది. కాగా- ఇదివరకు ఢిల్లీ పశ్చిమ ప్రాంతంలో నివసించే ఆ 31 సంవత్సరాల వ్యక్తి ఈ వైరస్ బారిన పడ్డాడు. అతనికీ ట్రావెల్ హిస్టరీ లేదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో నిర్వహించిన ఓ బ్యాచిలర్ పార్టీకి హాజరయ్యాడు. ఆ తరువాతే మంకీపాక్స్ లక్షణాలతో మౌలానా ఆజాద్ ఆసుపత్రిలో చేరాడు. అతను కోలుకున్నాడు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications