బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో కుప్పకూలిన మరో భవనం, ఊరికి వెళ్లారు, ప్రాణాలు మిగిలాయి, భారీ వర్షాలతో !

బెంగళూరులో కుప్పకూలిన మరో భవనంభారీ వర్షాలకు భూమిలో కుంగిపోయిన పునాదులు, కొట్టుకుపోయిన డ్రైనేజ్షాప్ రూంలు తియ్యలేదు, అద్దెకు ఉంటున్న వారు ఊరికి వెళ్లడంతో ప్రాణాలు మిగిలాయి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులోని ఈజీపురలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ఏడు మంది మరణించిన ఘటన మరవక ముందే మరో ప్రాంతంలో ఓ భవనం కుప్పకూలిపోయింది. బెంగళూరు నగరంలోని యశవంతపురం వార్డు నెంబర్ 37లో మంగళవారం మరో భవనం కుప్పకూలింది.

యశవంతపురంలోని వార్డు నెంబర్ 37లో చిక్కరాయన్న అనే వ్యక్తి ఓ భవనం నిర్మించారు. కింద రెండు షాప్ రూంలు, పైన ఇంటిని నిర్మించి అద్దెకు ఇచ్చాడు. బెంగళూరు నగరంలో గత 10 రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నందున ఈ కట్టడం పూర్తిగా దెబ్బ తినింది.

Another one building collapse in yeshwanthpurm in Bengaluru

కింద షాప్ రూంల్లోకి భారీ ఎత్తున నీరు చేరిపోవడంతో భవనం పునాదులు పూర్తిగా తడిచిపోయాయి. మంగళవారం ఒక్క సారిగా భవనం సమీపంలోని డ్రైనేజ్ కొట్టుకుపోవడంతో ఆ కట్టడం కుప్పకూలిపోయింది. షాప్ రూంలు తియ్యకపోవడం, పైన ఇంటిలో అద్దెకు నివాసం ఉంటున్న వారు ఊరికి వెళ్లడంతో వారు ప్రాణాలతో భయపడ్డారు. ఇంటి సామాగ్రి, షాప్ ల్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

Another one building collapse in yeshwanthpurm in Bengaluru

విసయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ బీకే. వెంకటేష్, బీబీఎంపీ ఇంజనీరు ఉమేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భారీ వర్షాలకు భవనం పునాదులు కుంగిపోవడంతో పాటు ప్రధాన డ్రైనేజ్ కొట్టుకుపోవడంతో భవనం కూలిపోయిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

English summary
After Ejipura tragedy, another one building adjacent to Rajakaluve collapses at Yeshwanthpur in Bengaluru, on October 17th. no casualties in the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X