• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Porn Racket : మరో పోర్న్ రాకెట్ బట్టబయలు-నటి నందితా దత్తా అరెస్ట్-యువతులను ట్రాప్ చేసి...

|

ప్రముఖ వ్యాపారవేత్త,హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్‌పై ఓవైపు విచారణ జరుగుతుండగానే మరో పోర్న్ రాకెట్ బయటపడింది. కోల్‌కతా కేంద్రంగా పోర్న్ రాకెట్ నిర్వహిస్తున్న నటి,ప్రముఖ మోడల్ నందితా దత్తాను పోలీసులు అరెస్ట్ చేశారు. 'నాన్సీ బాబీ' పేరుతో పాపులర్ అయిన నందితా దత్తా సెమీ పోర్న్ చిత్రాల్లో నటిగా,వాటికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సినిమాల్లో అవకాశాల పేరుతో పలువురు యువతులను ఆమె ట్రాప్ చేశారన్న ఆరోపణలున్నాయి. వారిని బలవంతంగా పోర్న్ రాకెట్‌లోకి దింపుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. నందితా దాస్ చేతిలో మోసపోయిన ఓ బాధితురాలు గత వారం కోల్‌కతాలోని న్యూ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

సినిమాల్లో అవకాశాల పేరుతో...

సినిమాల్లో అవకాశాల పేరుతో...

నందితా దాస్ గతంలో బిజీ మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. పలు ప్రముఖ బాండ్ల యాడ్ ప్రమోషన్లలో నటించారు. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఎక్కడా అదృష్టం కలిసిరాలేదు. దీంతో ఆమె పోర్న్ బాట పట్టారు. సెమీ పోర్న్ చిత్రాలు నిర్మిస్తూ అందులో నటిస్తున్నారు. ఇదే క్రమంలో సినిమాల్లో అవకాశాల కోసం వచ్చే యువతులకు మాయ మాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారు.

ఓటీటీ వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి బ్రేక్ ఇస్తామని చెప్పి వారితో ఒప్పందం చేసుకోవడం... ఆపై అడల్ట్ సీన్లలో నటించాలని వారిని వేధించడం,బెదిరింపులకు గురిచేయడం చేస్తున్నారు.

ఇలా వెలుగులోకి...

ఇలా వెలుగులోకి...

నందితా దత్తా పోర్న్ రాకెట్‌పై ఆమె చేతిలో మోసపోయిన ఇద్దరు బాధిత యువతులు జులై 26న న్యూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఓటీటీ వెబ్ సిరీస్ అని చెప్పి నగ్నంగా నటించాలంటూ నందితా దత్తా తనను వేధించారని బాధితుల్లో ఒకరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ స్టూడియోలో చిత్రీకరణ సందర్భంగా ఈ ఘటన జరిగిందన్నారు. న్యూ టౌన్ హోటల్‌లో జరిగిన మరో షూట్‌లో తన స్నేహితురాలిని నగ్నంగా నటించాలని వేధించినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదుకు కొద్దిరోజుల ముందే న్యూ టౌన్,సాల్ట్ లేక్ ప్రాంతాల్లో ఓ పోర్న్ రాకెట్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఘటనలో ఓ మేకప్ ఆర్టిస్టు,ఫోటోగ్రాఫర్‌ను అరెస్ట్ చేశారు.

యువతులను ట్రాప్ చేసి నగ్న చిత్రాల్లో నటించాలని...

యువతులను ట్రాప్ చేసి నగ్న చిత్రాల్లో నటించాలని...

నందితా దత్తా పోర్న్ రాకెట్‌పై పోలీసులు మాట్లాడుతూ... దిగువ,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువతులను ఆమె ట్రాప్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు..సినిమాల్లో అవకాశాల పేరుతో వారిని ట్రాప్ చేస్తున్న నందితా... ఆ తర్వాత పోర్న్ సన్నివేశాల్లో నటించేందుకు వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. బాధిత యువతుల ఫిర్యాదు మేరకు నందితా దత్తాపై కేసు నమోదు చేసుకొని డబ్ డమ్ ప్రాంతంలోని ఇంట్లో ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆమె సహాయకుడు మైనక్ ఘోష్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

రాజ్‌కుంద్రాతో సంబంధం ఉందా?

రాజ్‌కుంద్రాతో సంబంధం ఉందా?

నందితా దత్తాతో పాటు మైనక్ ఘోష్‌పై సెక్షన్లు 354B,354C,509,370,417,469ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఏయే ప్రాంతాల్లో వారు పోర్న్ చిత్రాలు చిత్రీకరిస్తున్నారు... వాటిని ఎవరికి విక్రయిస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు,రాజ్‌కుంద్రా పోర్న్ రాకెట్ వ్యవహారంతో దీనికేమైనా సంబంధం ఉందా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

పోర్న్ రాకెట్ కేసులో ముంబైలో అరెస్టయిన రాజ్‌కుంద్రా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో పలు సినిమాలకు ఫైనాన్షియర్‌గా,ఐపీఎల్‌లో రాజస్తాన్ టీమ్‌ యజమానిగా వ్యవహరించిన కుంద్రా పోర్న్ రాకెట్‌‌ పెద్ద సంచలనమే రేపింది.

English summary
Nandita Dutta, a model-cum-actor from adult OTT content, and her associate Mainak Ghosh have been arrested in Kolkata for allegedly forcing young models into pornography either by luring them with a ‘break’ in OTT platforms or by threatening them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X