వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుసగా రెండోరోజూ అదే రేంజ్‌లో: 29 లక్షలను దాటి: రెండో స్థానం వైపు భారత్:

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మరింత విజృంభిస్తోంది. రోజురోజుకూ మహా భయంకరంగా విస్తరిస్తోంది. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో వేగం మందగించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. భారత్‌లో మాత్రం దాని ప్రభావం ఏ మాత్రం తగ్గట్లేదు. పైగా గంటగంటకూ బలపడుతోంది. పాజిటివ్ కేసుల అంకెలు జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. కరోనా కాటుకు దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 54 వేల మందికి పైగా బలి అయ్యారు. రికార్డు స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వెయ్యి వరకు రోజువారీ మరణాలు నమోదు అవుతున్నాయి.

దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా: జనాభాలో సగానికి సగం మందికి: 26%: ప్రభుత్వ లెక్కల కంటేదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా: జనాభాలో సగానికి సగం మందికి: 26%: ప్రభుత్వ లెక్కల కంటే

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 68,898 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 983మంది మరణించారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 29,05,824కు చేరుకుంది. ఇప్పటిదాకా 54,849 మంది మరణించారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,92,028కు చేరుకుంది. 21,58,947 మంది డిశ్చార్జి అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందటే కేంద్ర వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేశారు.

Another Single day spike 68,898 positive cases and 983 deaths reported in India in the past 24 hours

వరుసగా రెండో రోజు కూడా 70 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపాటుకు గురి చేస్తోంది. గురువారం నాటి బులెటిన్ ప్రకారం దేశంలో 69 వేలకు పైగా కరోనా కేసులు రికార్డు కాగా.. మరుసటి రోజు 68,983 కేసులు నమోదు అయ్యాయి. ఇంచుమించు గురువారం నాటి పాజిటివ్ లెక్కలకు సమానంగా వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయి కేసులు ప్రపంచంలో మరెక్కడా నమోదు కాకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఇదే వేగం మరికొంత కాలం కొనసాగితే.. ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల్లో రెండోస్థానంలో కొనసాగుతోన్న బ్రెజిల్‌ను చేరుకోవడానికి భారత్‌కు ఇక ఎంతో కాలం పట్టకపోవచ్చు.

దేశంలో కరోనా వైరస్ పరీక్షలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్లు మూడు కోట్లను దాటేశాయి. ఇప్పటిదాకా 3,34,67,237 శాంపిళ్లను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. గురువారం ఒక్కరోజులో 8,05,985 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకల్లో కరోనా శాంపిళ్ల పరీక్షలు పెద్ద సంఖ్యలో కొనసాగుతున్నాయి. ఈ అయిదు రాష్ట్రాలూ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి.

Recommended Video

జాతీయ పత్రిక సర్వే.. అగ్ర స్థానం లో Yogi Adityanath | YS Jagan | KCR | Arvind Kejriwal || Oneindia

English summary
Single day spike 68,898 cases and 983 deaths reported in India in the past 24 hours. The Covid-19 tally in the country rises to 29,05,824 including 6,92,028 active cases and 21,58,947 discharges. The total deaths were reached at 54,849 deaths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X