Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కుక్కలనూ వదలని కామాంధులు.. మరో వీధికుక్కపై అత్యాచారం.. దేశాన్ని భయపెడుతున్న వికృతం!!

బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో రోడ్డుపై ఓ వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారం చేశాడు. ఈ వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవ్వడంతో జంతు ప్రేమికురాలు ఆ వ్యక్తిపై కేసు పెట్టి చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.

బీహార్ లోని పాట్నాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు వీధి కుక్కపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలోనూ వీధి కుక్కపై అత్యాచారానికి పాల్పడిన వరుస ఘటనలు సభ్య సమాజాన్ని షాక్ కు గురిచేశాయి. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇటువంటి ఘటనలు వెలుగులోకి రావడంతో ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న ఇటువంటి లైంగిక దాడులపై సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. వీళ్ళు మనుషులా పశువులా అన్న భావన ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది.

ఇక పాట్నాలో పట్టపగలు వీధి ఆడకుక్కపై జరిగిన అత్యాచార ఘటన సీసీ కెమెరాలలో రికార్డు కావడంతో బయటకు వచ్చింది. హోలీ పండుగ రోజున జరిగిన ఈ దారుణ ఘటన సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయిందని దీనిపై పాట్నాలోని పుల్వారీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా జంతు ప్రేమికురాలు ప్రియాధోత్రే ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో అది వైరల్ గా మారింది. భూరి ఫౌండేషన్ అనే జంతు స్వచ్చంద సంస్థ నుండి సదరు మానవ మృగం పై ఫిర్యాదు చేశామని ప్రియా ధోత్రే పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ఇది ట్విట్టర్ లో కూడా వైరల్ గా మారింది.

Another street dog rape incident in patna, case filed, demand for action

పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో సెక్షన్ 377 అమలవుతుందా అంటూ ప్రశ్నించారు. అసహజ పద్ధతిలో మనుషులపై కానీ, జంతువుల పై కానీ ఎవరైనా లైంగిక దాడులు చేస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష నుండి యావజీవ జైలు శిక్ష విధించడానికి, అదేవిధంగా జరిమానా విధించడానికి సెక్షన్ 377 ఉందని, దీనిని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రియా ధోత్రే పెట్టిన పోస్ట్ లో పేర్కొన్నారు.

దేశంలో ఇటువంటి అసహజమైన సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో జంతువుల పై ఇటువంటి లైంగిక దాడులు జరగకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్న విషయాన్ని ప్రియ ధోత్రే తన పోస్టు ద్వారా స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీలోని ఇంద్రపురి ప్రాంతంలోని జేజే కాలనీలో, నాగపూర్ లోని హడ్కేశ్వర్ ప్రాంతంలో, ముంబై పోవాయ్ లోని హీరాపన్నా మాల్ లో అనేక ఘటనలు ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, తాజాగా పాట్నాలో వెలుగులోకి వచ్చిన మరొక దారుణ ఘటన దేశంలో ఇదెక్కడి దరిద్రం అని ప్రతి ఒక్కరు ఆలోచించేలా చేస్తుంది. కఠినమైన శిక్షలు అమలు చేస్తే గాని, కఠిన చర్యలు అందరికీ తెలిసేలా తీసుకుంటే గాని జంతువులపై జరుగుతున్న లైంగిక దాడులకు చెక్ పడే అవకాశం ఉండదని అందరూ భావిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+