వీధి కుక్కలనూ వదిలిపెట్టరా? ఢిల్లీలో మరో వికృతం; దేశానికి ఇదెక్కడి దరిద్రం!!

దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కపై పబ్లిక్ గా, ఒక పార్కులో ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన మరిచిపోక ముందే, వీధి కుక్కను ఇంట్లోని బాత్రూంలోకి తీసుకువెళ్లి మరీ ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

మానవుల వికృతి చేష్టలకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. మనుషులపై అత్యాచారాలు చాలవు అన్నట్టు, జంతువులను కూడా టార్గెట్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న వరుస ఘటనలు మన సమాజం ఎటు పోతుంది అన్న ఆలోచనను ప్రతి ఒక్కరికి కలిగిస్తుంది. మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కపై పబ్లిక్ గా, ఒక పార్కులో ఒక వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన మరిచిపోక ముందే, తాజాగా మరో ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వీధి కుక్కను ఇంట్లోని బాత్రూంలోకి తీసుకువెళ్లి మరీ ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక ఈ ఘటన వివరాలలోకి వెళితే..

వీధికుక్కను బాత్రూంలోకి తీసుకెళ్ళి వ్యక్తి అత్యాచారం.. వీడియో వైరల్

వీధికుక్కను బాత్రూంలోకి తీసుకెళ్ళి వ్యక్తి అత్యాచారం.. వీడియో వైరల్


న్యూఢిల్లీలోని ఇందర్ పురీ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సతీష్ అనే వ్యక్తి ఇటీవల ఒక వీధి కుక్కను బాత్రూంలోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇరుగు పొరుగు వారు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఇక జంతు ప్రేమికులు సతీష్ చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ వైరల్ వీడియోతో ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారించారు. సతీష్ తల్లి సతీష్ గురించి షాకింగ్ నిజాలను వెల్లడించింది. అతనికి జంతువులపై అత్యాచారం చేసే అలవాటు ఉందని సతీష్ తల్లి పోలీసులతో చెప్పింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల పార్క్ లో కుక్కపై అత్యాచార ఘటన .. కేసు నమోదు

ఇటీవల పార్క్ లో కుక్కపై అత్యాచార ఘటన .. కేసు నమోదు

మొన్నటికి మొన్న దేశ రాజధాని ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలో ఒక పార్కులో ఒక వ్యక్తి వీధి కుక్కపై అత్యాచారం చేస్తూ కెమెరాకు పట్టుబడ్డాడు. ఈ మొత్తం సంఘటనను వీడియో తీసిన ఒక వ్యక్తి సోషల్ మీడియాలో దీనిని పోస్ట్ చేయడంతో, ఇది వైరల్ గా మారింది. ఈ ఘటనే అందరినీ నివ్వెర పరిచింది. చాలామంది జంతు ప్రేమికులు ఆ వ్యక్తి చేసిన పనికి షాక్ తిన్నారు.నోరులేని మూగజీవాలపై హింసకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 దేశానికి ఇదెక్కడి దరిద్రం

దేశానికి ఇదెక్కడి దరిద్రం

ఇక వరుస ఘటనల నేపథ్యంలో అసలు ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నాము అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఆలోచనలను రేకెత్తిస్తుంది. దేశానికి ఇదెక్కడి దరిద్రం అన్న భావన చాలామందిలో వ్యక్తం అవుతుంది. నోరులేని మూగ జీవాలపై అత్యాచారం చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో దీనిని కట్టడి చేయడానికి ఏం చేయాలి అన్న దానిపైన ప్రభుత్వం దృష్టి సారించవలసిన అవసరం ఉందన్న భావన వ్యక్తం అవుతుంది.

భయాందోళన కలిగిస్తున్న ఘటనలు

భయాందోళన కలిగిస్తున్న ఘటనలు


జంతు సంరక్షణకు కఠినమైన చట్టాలను అమలు చేయడమే కాకుండా, మానవులలో పెరుగుతున్న ఈ పశు ప్రవృత్తిని తగ్గించడానికి ఏం చేయాలి అన్న దానిపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మనిషి, పశువు అన్న విచక్షణ లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లపై కేసులు పెట్టి, కఠిన శిక్షలు విధిస్తే సరిపోతుందా? వారి ధోరణిలో మార్పు రావడానికి ఏం చేయాలి? వంటి అనేక ప్రశ్నలు చాలామందిని ఆలోచించేలా చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఒకింత భయాందోళన కలిగిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+