స్వామీజీపై ఫిర్యాదు అందలేదు, అందుకే: రూంలో నటితో రాసలీలల వీడియోపై పోలీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: బెంగళూరు శివారులోని యలహంక సమీపంలో గల హుణసమారణహళ్లిలోని మద్దేవణపుర మఠంలో ఓ స్వామీజీ నటితో రాసలీలలు జరుపుతున్న వీడియో బహిర్గతం అయింది.

చదవండి: బెంగళూరు మఠంలో నటితో స్వామీజీ రాసలీలలు: 500 ఏళ్ల చరిత్ర, వీడియో వైరల్, ఆందోళన!

బెడ్ రూంలో నటితో ఉండగా

బెడ్ రూంలో నటితో ఉండగా

ఇది కర్నాటకలో కలకలం రేపుతోంది. బెడ్ రూంలో నటితో స్వామీజీ రాసలీలలు జరుపుతున్న సమయంలో రహస్యంగా వీడియో తీసి దానిని గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే.

మఠం బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్

మఠం బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్

రహస్య కెమెరా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న ఈ దృశ్యాలను చూసి మఠం వద్దకు భక్తులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. కొందరు స్వాములు సైతం వీడియోలో ఉన్న స్వామీజీ దయానంద్‌ తక్షణమే మఠం బాధ్యతలనుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

దయానంద్‌పై ఫిర్యాదు రాలేదు, అందుకే

దయానంద్‌పై ఫిర్యాదు రాలేదు, అందుకే

దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మఠం వద్ద పోలీసులు మోహరించారు. ఈ అంశంపై బెంగళూరు నగర ఈశాన్యజోన్‌ డీసీపీ గిరీశ్‌ మాట్లాడారు. దయానందపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకోలేదన్నారు. తమకు ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

ఆ తర్వాత స్వామీజీ అయ్యాడు

ఆ తర్వాత స్వామీజీ అయ్యాడు

కాగా, మహిళలతో అక్రమ సంబంధాలు దయానంద్‌కు కొత్త కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. దయానంద్ 2011లో మఠానికి పీఠాధిపతి కావాలని విఫలయత్నం చేశాడు. ఆ తర్వాతే తన పేరును నంజీశ్వర్ స్వామీజీగా మార్చుకుని క్రమంగా మఠాధిపతి అయ్యాడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Another K'taka Swamiji Sex Scandal With Actress Caught on Hidden Camera

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి