అలర్ట్.. అలర్ట్ వర్ష బీభత్సం: మరో 3 రోజులు కుండపోతే..

దేశవ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతోంది. మరో మూడురోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ పరిశోధనా శాఖ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదన్నారు. చిక్కమగళూరు, హాసన్‌, కొడుగు, శివమొగ్గ, బెంగళూరు, బెంగళూరు గ్రామీణ, చిక్కబళ్ళాపుర జిల్లాలో భారీ వర్షాలు కురవవచ్చునని పేర్కొన్నారు. రామనగర్‌, తుమకూరు, మండ్య, మైసూరు, చామరాజనగర్‌, చిత్రదుర్గ, దావణగెరె, బీదర్‌, కలబురిగి, విజయపుర, యాదగిరి, బెళగావి, గదగ్‌, ధార్వాడ, హవేరి జిల్లాలో బుధవారం కూడా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. దాదాపు రాష్ట్రమంతటా ఎల్లో, ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షం కురుస్తోంది. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వర్షాలతో రోడ్లు తెగిపోవడంతో వందలాది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యింది. భారీ వర్షాలతో గోదావరి పరిధిలో గల అన్ని ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షపునీరు చేరి.. జలకళ సంతరించుకుంది. ఇదే అనుకూల సమయం అని భావించి కొందరు పరిశీలించేందుకు వెళుతున్నారు.

another three days rains in the states

రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఉరుములు, మెరుపుల‌తో చాలా చోట్ల వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందన్నారు. వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.

వర్షాల దాటికి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల దాటికి పలు చోట్ల నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇక గత రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో వార్త చెప్పింది. రానున్న మూడు రోజులు తెలంగాణలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో అయితే వాతావరణం చల్లగానే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+