రాజస్థాన్‌లో తప్పిన మరో రైలు ప్రమాదం... రైల్వే ట్రాక్‌పై తొలగించిన ఫిష్ ప్లేట్లు..
రాజస్థాన్‌లో మరో రైలు ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని బికనెర్ అర్బన్ ప్రాంతంలో చౌకుంతి ఓవర్‌బ్రిడ్జి కింద నున్న రైల్వే ట్రాక్‌పై ఫిష్ ప్లేట్లు తొలగించి ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులకు అక్కడే ఉన్న అధికారులకు సమాచారం చేరవేశారు. దాంతో అధికారులు సకాలంలో రైల్వే ట్రాక్‌దగ్గరికి చేరుకున్నారు. అప్పటికిప్పుడు ఫిష్ ప్లేట్లను గట్టిగా బిగించి ట్రాక్‌పై ఎలాంటి ప్రమాదాలు జరగక్కుండా చర్యలు చేపట్టారు.
ఇటీవలే తరుచుగా రైలు ప్రమాదాలు జరిపించేందుకు అనేక ప్రయత్నాలే జరుగుతున్నాయి. ఇదే తరహా ఘటన తాజాగా రాజస్థాన్ లోని బికనెర్‌లో వెలుగుచూసింది. కొందరు గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాలపై ఫిష్‌ప్లేట్లు తొలగించడాన్ని స్థానికులు గుర్తించారు. దాంతో అక్కడే ఉన్న అధికారులకు ఆ సమాచారన్ని చేరవేశారు. దాంతో అధికారులు సకాలంలో రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చి పొంచి ఉన్న ప్రమాదం బారి నుంచి తప్పించారు.

రైల్వే ట్రాక్‌పై ఫిష్ ప్లేట్లు..
బికనెర్ అర్బన్ ప్రాంతంలోని చౌకుంతి ఓవర్‌బ్రిడ్జి కింద నున్న రైల్వే ట్రాక్‌పై కొందరు గుర్తుతెలియని యువకులు ఫిష్ ప్లేట్లను తొలగిస్తుండగా స్థానికులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో వారు పారిపోయినట్టు స్థానికులు వివరించారు. ఆ తర్వాత రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్‌కు సమాచారం అందించడంతో వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే రైల్వే వర్క్‌షాప్ సిబ్బంది అప్పటికిప్పుడు ఫిష్ ప్లేట్లను గట్టిగా బిగించి ట్రాక్‌పై ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా చర్యలు చేపట్టారు. అయితే, రైల్వే ట్రాక్‌పై షిఫ్ ప్లేట్లు తొలగించిన అగంతకులను ఇంతవరకూ గుర్తించలేదు. ఇది ఎలాంటి కుట్ర కాదని, సమీపంలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన కొందరు యువకులు చేసిన పనిగా అనుమానిస్తున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.












Click it and Unblock the Notifications