ఢిల్లీలో దిగిన నాలుగో అమెరికా విమానం-ఈసారి పనామా బ్యాచ్ ?
అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసల బహిష్కరణ కొనసాగుతోంది. ట్రంప్-మోడీ భేటీ తర్వాత వలసల బహిష్కరణ ఆగుతుందని, లేదా నెమ్మదిస్తుందని భావించిన వారికి మరో షాక్ తగిలింది. ఇప్పటివరకూ పంజాబ్ లోని అమృత్ సర్ కు అమెరికా విమానాలు వస్తుండగా.. ఈసారి మాత్రం రాజధాని డిల్లీలో ఓ విమానం దిగింది. అమెరికా నుంచి భారత్ కు వచ్చిన నాలుగో విమానం ఇది.
ఇవాళ ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన అమెరికా విమానంలో మొత్తం 12 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో అక్రమ వలసదారులుగా గుర్తించిన తర్వాత వీరిని పొరుగుదేశం పనామాకు తరలించి అక్కడ కొంతకాలం ఉంచి గుట్టుచప్పుడు కాకుండా భారత్ కు తరలించినట్లు తెలుస్తోంది. దీంతో పనామా నుంచి అమెరికా విమానంలో వీరు భారత్ చేరుకున్నారు. అనంతరం స్వస్థలాలకు వీరిని తరలించారు. వీరిలో నలుగురు అమృత్ సర్ కు చెందిన వారు ఉన్నారు.

ఫిబ్రవరి 5న అమెరికా నుంచి వచ్చిన 104 మంది భారతీయుల తొలి విమానం భారత్ లోని అమృత్ సర్ లో ల్యాండ్ అయింది. ఆ తర్వాత వరుసగా భారత్ కు విమానాలు చేరుకుంటున్నాయి. అయితే ఇందులో వస్తున్న భారతీయుల పట్ల బేడీలు వేసి అనుచితంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై స్పందించిన కేంద్రం.. ఇది ఇప్పుడేం కొత్త కాదని చెప్పేస్తోంది. చాలా ఏళ్లుగా ఇది కొనసాగుతూనే ఉందని విదేశాంగమంత్రి జైశంకర్ గుర్తుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికా నుంచి పనామాకు తరలించిన 300 మందిలో 12 మంది భారతీయుల్ని ఢిల్లీకి తెచ్చారు.












Click it and Unblock the Notifications