హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోవిడ్-19 విరుగుడు.. హైదరాబాద్‌లో ఆ డ్రగ్ టెక్నాలజీ అభివృద్ది.. క్లినికల్ ట్రయల్స్‌కు సిద్దం..

|
Google Oneindia TeluguNews

కరోనాకు వ్యాక్సిన్ లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం కనీసం ఏడాది సమయం పట్టవచ్చునని సైంటిస్టులు,పరిశోధకులు చెబుతున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎగబాకుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ఆయా చికిత్స విధానాల్లో ఉపయోగిస్తున్న యాంటీ వైరల్ డ్రగ్స్‌ను కూడా పరీక్షించే ప్రయత్నం చేస్తున్నారు. చైనా,జపాన్ వంటి దేశాలు ఫవిపిరవిర్ అనే యాంటీ వైరల్ డ్రగ్‌ను అభివృద్ది చేయడంపై ఫోకస్ చేయడంతో.. భారత్ కూడా అదే బాటలో నడుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) ఈ యాంటీ వైరల్ డ్రగ్‌ను తయారుచేసే టెక్నాలజీని అభివృద్ది చేసింది.

విశాఖ గ్యాస్ లీకేజీ.. బాధితుల్లో పుట్టుకొస్తున్న కొత్త సమస్యలు..విశాఖ గ్యాస్ లీకేజీ.. బాధితుల్లో పుట్టుకొస్తున్న కొత్త సమస్యలు..

ప్రైవేట్ కంపెనీకి అప్పగించిన ఐఐసీటీ

ప్రైవేట్ కంపెనీకి అప్పగించిన ఐఐసీటీ

కరోనా వైరస్‌తో పోరాడేందుకు ఫవిపిరవిర్, ఫైటోఫార్మస్యూటికల్ అనే యాంటీ వైరల్ డ్రగ్స్‌ను క్లినికల్ ట్రయల్స్ చేసేందుకు ది కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. దీంతో సీఎస్ఐఆర్ ల్యాబోరేటరీలో ఇటీవల అభివృద్ది చేసిన ఫవిపరివిర్‌పై క్లినికల్ ట్రయల్స్ జరపనున్నారు. హైదరాబాద్‌లోని ఐఐసీటీ ఫవిపిరవిర్ ఈ డ్రగ్ తయారీకి అవసరమయ్యే టెక్నాలజీని అభివృద్ది చేసింది. ఐఐసీటీ ఈ డ్రగ్‌ టెక్నాలజీని ఓ ప్రైవేట్ కంపెనీకి అప్పగించినట్టు ఆ సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ వెల్లడించారు.

క్లినికల్ ట్రయల్స్‌కు సిద్దం

క్లినికల్ ట్రయల్స్‌కు సిద్దం

ఆ కంపెనీ ఇప్పుడు కొన్ని ఆసుపత్రులతో టైఅప్ అయ్యి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తుందని చంద్రశేఖర్ తెలిపారు. కోవిడ్-19 పేషెంట్లపై దీని పరీక్షిస్తారని.. అయితే ప్రోటోకాల్ ప్రకారం సదరు పేషెంట్ల అంగీకారం తప్పనిసరి అని చెప్పారు. చైనా,జపాన్ దేశాల్లో ఈ డ్రగ్‌ను ఇన్‌ఫ్లూయెంజా చికిత్సకు వాడుతారని చెప్పారు. సాధారణంగా ఒక వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు అనేక రూపాలుగా రూపాంతరం చెందేందుకు ప్రయత్నిస్తుందని.. ఫవిపిరవిర్ దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు.

Recommended Video

Pubs, Bars, Clubs And Restaurants Can Sell Liquor, Conditions Applied
దేశంలోని 3 ప్రధాన ఆసుపత్రుల్లో..

దేశంలోని 3 ప్రధాన ఆసుపత్రుల్లో..

సీఎస్ఐఆర్ ఇప్పటికే కెడిలా ఫార్మాసూటికల్స్ లిమిటెడ్‌తో టైఅప్ అయింది. కోవిడ్ 19 పేషెంట్ల నుంచి మైకోబాక్టీరియంను తొలగించి వైరస్ వ్యాప్తిని తగ్గించడంపై సీఎస్ఐఆర్ దృష్టి సారించింది. మైకోబాక్టీరియం W కరోనా పేషెంట్లలో మరణం బారినపడకుండా కాపాడుతుందని చెబుతున్నారు. దేశంలోని 3 ప్రధాన ఆసుపత్రుల్లో క్లినికల్ ట్రయల్స్‌కు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అనుమతినిచ్చిందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ శేఖర్ మండే తెలిపారు. మైకోబాక్టీరియం TH1,TH2 కణాలను ఉత్తేజపరచడంలో బాగా పనిచేస్తుందని.. తద్వారా వైరస్‌పై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పారు.

English summary
The Drug Controller of India has allowed clinical trial of Favipiravir medicine, developed indigenously a CSIR laboratory, on coronavirus patients, Director-General Shekhar Mande said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X