Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇక కొత్త అనుభూతి.. విమానం తరహా విలాసవంతమైన సౌకర్యాలు..

చెన్నై: రైలు ప్రయాణికులకు శుభవార్త. దేశంలోనే మొట్టమొదటిసారి విమానంలోని విలాసవంతమైన సౌకర్యాలు శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికులకు కల్పించారు. చెన్నై సెంట్రల్- మైసూర్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణికులు శుక్రవారం నుంచి కొత్త అనుభూతి పొందుతారని దక్షిణ రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ రైలులో ప్రతీ సీటుకు ఇన్ఫోటెయిన్‌మెంట్ తెరలు, యూజర్ ఫ్రెండ్లీ స్నాక్ టేబుల్, సౌకర్యవంతమైన సీట్, రెక్నినింగ్ సదుపాయాలు ఉంటాయి. ప్రత్యేకంగా రూ. 3 కోట్ల వ్యయంతో కూడిన కోచ్ ను ప్రయాణికులకు విమాన సదుపాయాలతో పెరంబూర్ సమీకృత కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు.

 Anubhuti coaches with aircraft-like features to replace Shatabdi 1st-AC Executive chair cars

టాయిలెట్లను హ్యాండ్స్-ఫ్రీ పీపాలోహిత వ్యవస్థతో అమర్చారు. రైలు బోగీ తలుపులకు ఆటోమేటెడ్ సెన్సార్-ఎనేబుల్ చేశారు. తలుపులు చూడడానికి స్టార్ హోటల్ ఉన్నమాదిరిగా ఉన్నాయి.

ప్రయాణికుల సీట్ల వద్ద కాలింగ్ బెల్ తో పాటు విలాసవంతమైన సౌకర్యాలు రైలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. చెన్నై నుంచి మైసూరు వెళ్లే ఈ రైలుకు శుక్రవారం నుంచి పచ్చజెండా ఊపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+