వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్! జెఎన్‌యు సరే పాక్‌లో కోహ్లీ ఫ్యాన్ మాటేంటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ పైన ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటిలో గొడవ నేపథ్యంలో కేజ్రీని ఖేర్ ప్రశ్నించారు.

జెఎన్‌యులో పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని విద్యార్థులను కొడతారా? దేశంలో అసలు చట్టం పని చేస్తోందా? అంటూ కేజ్రీవాల్ అడగడాన్ని ఖేర్ ఓ అంశాన్ని ప్రస్తావించి సమాధానం ఇచ్చారు.

Anupam Kher on JNU row: Indians won’t let them destroy our country

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి వీరాభిమానినంటూ జనవరిలో ఓ పాకిస్థానీ వ్యక్తి తన ఇంటిపై భారత పతాకాన్ని ఎగురవేశాడని, అది తెలిసిన వెంటనే పాకిస్తాన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి వెంటనే జైల్లో వేశారని, అక్కడ మనోళ్ల పరిస్థితి ఇలా ఉంది సర్! అని అనుపమ్ పేర్కొన్నారు. దేశంలో అసలేం జరుగుతోందని అనుపమ్ ఖేర్ ప్రశ్నించారు.

కన్నయ్యకు మద్దతుగా చెన్నైలో ఆందోళన

జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకు మద్దతుగా తమిళనాడు రాజధాని చెన్నైలో గురువారం ఆందోళనలు చేశారు. కన్నయ్య అరెస్టు, ఆయనపై న్యాయవాదుల దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆందోళన చేస్తున్న దాదాపు అరవై మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారిలో జానపద గాయకుడు కోవన్‌ కూడా ఉన్నారు.

English summary
Anupam Kher on JNU row: Indians won’t let them destroy our country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X