డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామాలో కొత్త ట్విస్ట్
బెంగళూరు: కర్నాటకవ్యాప్తంగా చర్చనీయాంశమైన కూడ్లిగి డిఎస్పీ అనుపమ షెనాయ్ రాజీనామా అంశం ఇంకా రాష్ట్రంలో చర్చనీయాంశంగానే ఉంది. అనుపమ సోదరుడు అచ్యుత్ గురువారం మాట్లాడుతూ... తన సోదరి గవర్నర్, సోనియా గాంధీ తదితరులను కలుస్తారని చెప్పారు. తన రాజీనామాకు గల కారణాలు వివరిస్తారన్నారు.
కర్నాటకలో గత పదిహేను రోజులుగా అనుపమ షెనాయ్ రాజీనామా అంశం దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఆమె రాజీనామాలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.
కర్నాటక మంత్రి పరమేశ్వర తన విధుల్లో జోక్యం చేసుకున్నారని, ఆటంకం కలిగించారని, తనను బెదిరించారని ఆరోపిస్తూ ఆమె తొలుత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ పేజీలో పలు పోస్టులు మంత్రికి వ్యతిరేకంగా వచ్చాయి. ఆమె లీవ్ పైన వెళ్లారు.

ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖలో మంత్రి పేరు ప్రస్తావిస్తూ ఆయనపై ఆరోపణలు చేస్తూ, ఆమె రాజీనామా చేయడంతో తొలుత అంగీకరించలేదనే వాదనలు ఉన్నాయి.
ఆయన పేరు లేకుండా రాజీనామా లేఖ ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోందని అంటున్నారు. దీంతో ఆమె మంత్రి ప్రస్తావన లేకుండా మరో రాజీనామా లేఖ ఇవ్వగా, దానికి ఆమోద ముద్ర లభించిందని అంటున్నారు. అయితే, మరో రాజీనామా పంపించలేదని, కేవలం ఒక రాజీనామానే పంపించారని కూడా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications