వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిస్టియన్లను ఇబ్బందులకు గురిచేస్తే కళ్ళు పీకేస్తాం: సిద్దూ సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్: పంజాబ్ రాష్ట్ర మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రిస్టియన్లను పంజాబ్ రాష్ట్రంలో ఇబ్బందులకు గురి చేస్తే వారి కళ్ళను పీకేస్తామని హెచ్చరించారు.

మత విశ్వాసాల ప్రకారం విడిపోవడం దేశానికి మంచిదికాదు: కార్డినల్మత విశ్వాసాల ప్రకారం విడిపోవడం దేశానికి మంచిదికాదు: కార్డినల్

గురువారం నాడు క్రిస్టియన్ల సమావేశంలో నవజ్యోత్ సింగ్ మాట్లాడారు.ఇదే తరహ వ్యాఖ్యలు గతంలో మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి నేత సిపిఎం‌పై ఉపయోగించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై కన్నుపడితే సిపిఎం కార్యకర్తల కళ్ళు తీసేస్తామని హెచ్చరించారు.

Anyone staring down Christians will have their eyes gouged out, says Navjot Singh Sidhu

క్రిస్ట్‌మస్ సంబరాలను అమృత్‌సర్ పట్టణంలో పంజాబ్ ప్రభుత్వం గురువారం నాడు నిర్వహించింది. ఈ సంబరాల్లో పాల్గొన్న నవజ్యోత్ సిద్దూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.2016లో సిద్దూ బిజెపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అయితే ఇదే వేదికపై సిద్దూ కంటేత ముందుగా మాట్లాడిన రోమన్ క్యాథలిక్ డయాసిస్ జలంధర్ చీఫ్ బిష్ ఫ్రాంకో దేశంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావించారు.దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ సంబరాలు జరుపుకోకుండా అడ్డుకొన్న ఘటనలను ప్రస్తావించారు.
అయితే క్రిస్మస్ సంబరాలను జరుపుకోవడాన్ని కొందరు అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఒక రకంగా మానవహక్కుల ఉల్లంఘనగా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పంజాబ్ రాష్ట్రంలో ఈ తరహ ఘటలను మాత్రం లేవని ఆయన చెప్పారు.

అయితే పంజాబ్ రాష్ట్రంలో అన్ని మతాలు తమ మతాచారాల ప్రకారంగా శాంతియుతంగా జీవనం సాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి సిద్దూ చెప్పారు. తమ ప్రభుత్వం అందరికీ సమాన హక్కులను కల్పించేలా చర్యలు తీసుకొందన్నారు.పంజాబ్ రాష్ట్రంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కల్పించకుండా సౌకర్యాలు కల్పించినట్టుగా చెప్పారు.

English summary
PUNJAB MINISTER Navjot Singh Sidhu warned on Thursday that anyone “staring down” Christians in Punjab would have their eyes gouged out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X