ములాయం చిన్న కోడలు ధిక్కారం: అంతేకాదు, మోడీతో సెల్ఫీ

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ట్రిపుల్ తలాక్ బిల్లుపై సమాజ్‌వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఝలక్ ఇచ్చారు. పార్టీ వైఖరికి భిన్నంగా ఆమె ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతు ప్రకటించారు.

అంతేకాకుండా, కుటుంబ సభ్యులతో కలిసి ఆదిత్యానాథ్‌ను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీతో అపర్ణా యాదవ్ గతంలో సెల్ఫీ కూడా తీసుకున్నారు. ఆమె వ్యవహారం సమాజ్‌వాదీ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా గతంలో కూడా ఆమె వ్యవహరించారు.

 ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దత

ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దత

కేంద్రంలోని ఎన్డీయె ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు అపర్ణా యాదవ్ శుక్రవారంనాడు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. తలాక్ బిల్లును ఓ ట్వీట్‌లో ఆమె స్వాగతించారు.

 ముందడుగు అంటూ ట్వీట్..

ముందడుగు అంటూ ట్వీట్..

ట్రిపుల్ తలాక్ బిల్లును స్వాగతించదగిన ముందడుగుగా అపర్ణా యాదవ్ అభివర్ణించారు. దానివల్ల మహిళలకు ముఖ్యంగా ముస్లిం మహిళలకు సాధికారత లభిస్తుందని, ముస్లిం మహిళలు ఎన్నోఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఊరట లభిస్తుందని ఆమె అన్నారు.

బిల్లుపై ఎస్పీ వాదన ఇదీ..

బిల్లుపై ఎస్పీ వాదన ఇదీ..

ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎస్పీ లోకసభలో కొన్ని సవరణలు ప్రతిపాదించింది. సవరణలు చేయకుండా బిల్లును ప్రస్తుత రూపంలో అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. తలాక్ బిల్లుతో వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రయోజనం పొందాలని చూస్తోందని విమర్శించింది.

 నరేంద్ర మోడీతో భేటీ, సెల్ఫీ

నరేంద్ర మోడీతో భేటీ, సెల్ఫీ

నిరుడు లక్నోలో ఇఫ్తార్ పార్టీలోనూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అపర్ణా యాదవ్, ప్రతీక్ యాదవ్ దంపతులు కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఓసారి అపర్ణా యాదవ్ సెల్ఫీ కూడా తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mulayam Singh Yadav's daughter-in-law Aparna Yadav has supported Triple Talaq Bill against the Samajwadi party line.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి