తగ్గేదేలే- ప్రాజెక్టుల అప్పగింతకు ఏపీ, తెలంగాణ నో- అపెక్స్ కౌన్సిల్ కు పంచాయితీ

ఏపీ, తెలంగాణ విభజన తర్వాత వివాదాస్పదంగా మారిన సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల వంటి వ్యవహారాల్లో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదిరిపోవడంతో ఈ వ్యవహారాన్ని ఇద్దరూ కేంద్రం చేతుల్లో పెట్టేశారు. దీంతో ఇప్పుడు కేంద్రం అన్ని ప్రాజెక్టుల్ని తమ ఆధీనంలో ఉండే నదీ యాజమాన్య బోర్డులకు అప్పగించాలని కోరుతోంది. కానీ దీనికి రెండు రాష్ట్రాలూ ససేమిరా అంటున్నాయి. దీంతో మరో వివాదం నెలకొంది.

 తెలుగు రాష్ట్రాల పంచాయతీ

తెలుగు రాష్ట్రాల పంచాయతీ

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత సాగునీటి ప్రాజెక్టుల విషయంలో విభేదాలు మొదలయ్యాయి. మొదట్లో నీటి విడుదలకు సంబంధించి మొదలైన వివాదాలు ఆ తర్వాత నిర్వహణకూ పాకాయి. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. చివరికి ఇరు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాసి మరీ ఈ వ్యవహారాన్ని కేంద్రం చేతుల్లో పెట్టేశాయి. ఆ తర్వాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి కృష్ణా, గోదావరి రివర్ బోర్డుల్ని ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో ఉన్న ప్రాజెక్టుల్ని బోర్డులకు అప్పగించాలని ఇరు రాష్ట్రాలకు కోరింది. కానీ ఏపీ, తెలంగాణ మాత్రం ససేమిరా అంటున్నాయి.

కేంద్రానికి పెత్తనం ఇచ్చి...

కేంద్రానికి పెత్తనం ఇచ్చి...

ప్రాజెక్టుల వ్యవహారంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు ముదరడంతో కేంద్రం జోక్యం కోరాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని కూడా కోరాయి. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం తామే ప్రాజెక్టుల్ని నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీని ప్రకారమే ప్రాజెక్టుల్ని అప్పగించాలని ఇరు రాష్ట్రాల్ని కోరుతోంది. కానీ ఇప్పుడు అవే ప్రాజెక్టుల్ని అప్పగించేందుకు ఇరు రాష్ట్రాలు ఒప్పుకోవడం లేదు దీంతో కేంద్రానికి పెత్తనం ఇవ్వడమెందుకు, ఇప్పుడు ప్రాజెక్టుల్ని అప్పగించకుండా మరో వివాదానికి ఆజ్యం పోయడమెందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సీఎస్ లతో చర్చలు విఫలం

సీఎస్ లతో చర్చలు విఫలం

ప్రాజెక్టుల్ని కృష్ణా, గోదావరి నదీ బోర్డులకు అప్పగించే విషయంలో కేంద్రం సూచనల ప్రకారం ముందుకు నడిచేందుకు ఏపీ, తెలంగాణ నిరాకరిస్తున్న నేపథ్యంలో నిన్న కేంద్ర జల్ శక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎస్ లతో భేటీ అయింది. ఏపీ, తెలంగాణలో కృష్ణాై, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల్ని ఆయా రివర్ బోర్డులకు అప్పగించడంతో పాటు వాటి నిర్వహణకు ప్రాజెక్టుకు రూ.200 కోట్లు చొప్పున ఇవ్వాలని కేంద్రం కోరుతోంది. కానీ ఇరు రాష్ట్రాలు ఒప్పుకోలేదు. తెలంగాణలోని సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్ని రివర్ బోర్టులకు ఇచ్చేందుకు తెలంగాణ అంగీకరించలేదు. అలాగే ఏపీ కడుతున్న రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపైనా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అలాగే తెలంగాణలో దిండి, పాలమూరు ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో సీఎస్ లతో కేంద్రం జరిపిన చర్చలు ఫలించలేదు.

అడ్డంగా బుక్కయిన ఏపీ, తెలంగాణ

అడ్డంగా బుక్కయిన ఏపీ, తెలంగాణ

ప్రాజెక్టుల అప్పగింత, వాటి నిర్వహణకు నిధుల కేటాయింపుకు ఇరు రాష్ట్రాలు ససేమిరా అంటున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే తెలంగాణ తీరుపై గుర్రుగా ఉన్న షెకావత్ ఈ భేటీలో ఏం చెప్పబోతున్నారనేది కూడా కీలకంగా మారింది. అయితే ప్రాజెక్టుల అప్పగింత మాత్రం తప్పదని తేలిపోతోంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాలు స్వయంగా కోరిన మీదటే తాము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లు కేంద్రం చెబుతోంది. దీనికి ఓసారి ఒప్పుకుని తిరిగి యూటర్న్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇరు రాష్టాలు బుక్కయినట్లే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+