కలాం భౌతికకాయం రామేశ్వరం తరలింపు (వీడియో)
న్యూఢిల్లీ/మధురై: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ అబ్దుల్ కలాం పార్థీవదేహాన్ని తీసుకుని రామేశ్వరం బయలుదేరారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ లోని ఆయన నివాసం నుండి సైనిక వాహనంలో పార్థీవదేహాన్ని తీసుకుని పాలం విమానాశ్రయం చేరుకున్నారు.
తరువాత అక్కడి నుండి వాయుసేనకు చెందిన ప్రత్యేక విమానంలో పార్థీవదేహంతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయకుడు, మనోహర్ పారికర్ మధురై బయలుదేరారు. వెంట త్రిధళ రక్షణ శాఖ అధికారులు ఉన్నారు.

మధురై నుండి వైమానికదళ హెలికాప్టర్ లో కలాం పార్థీవదేహాన్ని రామేశ్వరం తీసుకు వెళుతున్నారు. బుధవారం రాత్రి 7 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అయన భౌతికకాయాన్ని ఉంచుతారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ప్రభుత్వ లాంచనాలతో రామేశ్వరంలో కలాం అంత్యక్రియలు నిర్వహిస్తారు.












Click it and Unblock the Notifications