అపోలో ఆస్పత్రుల ఛైర్మన్ ప్రతాప్ రెడ్డికి గుండెపోటు: ఆస్పత్రిలో చేరిక
చెన్నై: అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ రెడ్డికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో శుక్రవారం అర్ధరాత్రి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స ఆయనకు అందిస్తున్నారు.
చెన్నై నగరంలో తన స్వగృహంలో ప్రతాప్ రెడ్డి మార్చి 23వ తేదీ అర్ధరాత్రి హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆందోళన చెందిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో ఆయనను ప్రత్యేక వార్డుకు తరలించిన డాక్టర్ల బృందం చికిత్స అందిస్తోంది. వారి పర్యవేక్షనలో ప్రస్తుతం ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెన్నై అపోలో వైద్యులు శనివారం ఉదయం వెల్లడించారు.












Click it and Unblock the Notifications