వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్‌లో సర్వేలు అనుకూలమే కానీ, కీలక నేతల మధ్య 'సీఎం' చిచ్చు, బీజేపీకి ప్లస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ వరుసగా మూడుసార్లు గెలవడం వల్ల ప్రజా వ్యతిరేకత ఉండటం ఖాయం. అయినప్పటికీ బీజేపీ ముఖ్యమంత్రులు రమణ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్‌ల పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు.

రిపబ్లిక్ టీవీ-సీ ఓటరు సర్వే: దేశంలో మళ్లీ మోడీయే కానీ, ఏపీలో జగన్‌దే హవా, బాబుకు దెబ్బరిపబ్లిక్ టీవీ-సీ ఓటరు సర్వే: దేశంలో మళ్లీ మోడీయే కానీ, ఏపీలో జగన్‌దే హవా, బాబుకు దెబ్బ

బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. కొన్ని సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని చెబితే, మరికొన్ని సర్వేలు గట్టి పోటీ ఉన్నప్పటికీ బీజేపీ గట్టెక్కుతుందని అంటున్నాయి. రాజస్థాన్‌లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఈ మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీకి మరింత నష్టం తెచ్చేలా ఉందని అంటున్నారు.

సర్వేల్లో బీజేపీకి షాక్, కానీ కాంగ్రెస్‌తో రాజస్థాన్‌లో ప్లస్

సర్వేల్లో బీజేపీకి షాక్, కానీ కాంగ్రెస్‌తో రాజస్థాన్‌లో ప్లస్

రాజస్థాన్ కాంగ్రెస్ వశం కావడం ఖాయమని పలు సర్వేలు వెల్లడించాయి. కానీ బీజేపీ నాయకులు మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకుల అంతర్గత పోరు తమకు లాభిస్తుందని భావిస్తున్నారు. వసుంధరా రాజే ప్రభుత్వంపై ప్రజలలో ఆగ్రహం ఉంది. కానీ నేతల మధ్య విభేదాలు బీజేపీకి కొంత ప్లస్ అవుతుందని అంటున్నారు.

మధ్యప్రదేశ్‌లో కీలక నేతల మధ్య విభేదాలు

మధ్యప్రదేశ్‌లో కీలక నేతల మధ్య విభేదాలు

మధ్యప్రదేశ్‌లోను కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య విభేదాలు బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయని అంటున్నారు. సీనియర్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య ఉన్న విభేదాల కారణంగా బీజేపీకి లాభం చేకూరుతుందని, పదిహేనేళ్ల పాలన అనంతరం మళ్లీ శివరాజ్ సింగ్ చౌహన్ సీఎం కావడానికి విపక్ష నేతల విభేదాలే ఉపయోగపడతాయనే వాదనలు వినిపిస్తున్నాయి.

విభేదాలు తొలగిపోయాయని కాంగ్రెస్

విభేదాలు తొలగిపోయాయని కాంగ్రెస్

అయితే సింధియా, దిగ్విజయ్‌ల మధ్య విభేదాలు లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వారిద్దరు కలిసి పని చేసుకుపోతారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ మాజీ నేత అజిత్ జోగి దెబ్బతీస్తారని అంటున్నారు.

రాజస్థాన్‌లో సీఎం చిచ్చు

రాజస్థాన్‌లో సీఎం చిచ్చు

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రుల పట్ల పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ రాజస్థాన్‌లో వసుంధర పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు ఆ పార్టీకి నిద్రపట్టనీయడం లేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ పోటీ చేయనున్నారు. ఆయన సీఎం రేసులో ఉన్నారు. మరోవైపు మరో సీనియర్ నేత సచిన్ పైలట్ కూడా ముఖ్యమంత్రి ఆశలు పెట్టుకున్నారు. వీరిద్దరి మధ్య సీఎం రేసు పోటీయే పార్టీకి పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. ఒకరిని మరొకరు నష్టపరుచుకునే ప్రయత్నాలు చేయవచ్చునని భావిస్తున్నారు. ఓవైపు పెద్ద ఎత్తున తన మద్దతుదారులకు గెహ్లాట్ టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు సచిన్ పైలట్ అనుచరులు కీలకంగా ఉన్నారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లో విభేదాలు బాగా ఉన్నాయంటున్నారు.

English summary
It is not just any particular state but the Bharatiya Janata Party (BJP) is banking more on infighting in Madhya Pradesh, Chhattisgarh and Rajasthan than anything. The BJP is more hopeful with the Congress infighting even in the state where every survey disappointed the party - Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X