హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా : వెంటిలేటర్‌పై పెడితే అంతేనా.. సైడ్ ఎఫెక్ట్స్‌తో ముప్పు ఉంటుందా..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మనిషి శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుందన్న సంగతి తెలిసిందే. వైరస్ లోడ్ ఎక్కువై ఊపిరి తీసుకోవడం కష్టమైతే చివరి నిమిషంలో పేషెంట్‌ను వెంటిలేటర్‌పై ఉంచుతారు. అయితే వెంటిలేషన్
ట్రీట్‌మెంట్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా..? అవి ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయా..? కరోనా వైరస్ చికిత్స విధానంలో అసలు వెంటిలేటర్లను ఎలా ఉపయోగిస్తున్నారో ఒకసారి పరిశీలిద్దాం...

నిపుణులు ఏమంటున్నారు...

నిపుణులు ఏమంటున్నారు...

వెంటిలేటర్లపై చికిత్స పొందినవారిలో దాదాపు 40-50శాతం మంది మృత్యువాత పడుతుంటారని న్యూయార్క్‌లోని మౌంట్ సినయ్ ఆసుపత్రిలో పల్మోనాలజిస్ట్‌గా పనిచేస్తున్న డా.ఉదిత్ చద్దా తెలిపారు. అయితే కరోనా వైరస్ పేషెంట్లలో ఈ రిస్క్ ఎక్కువగా ఉందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ న్యూయార్క్ లాంటి నగరాల్లో వెంటిలేటర్ చికిత్స పొందుతున్న కోవిడ్ 19 పేషెంట్లలో దాదాపు 80శాతం మంది మృత్యువాతపడ్డారని తెలిపారు.

వెంటిలేటర్‌పై చికిత్స పొంది కోలుకున్నవారిలోనూ దీర్ఘకాలం శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. వెంటిలేటర్ లేదా వైరస్ కలిగించే నష్టం ద్వారా ఈ సమస్య తలెత్తవచ్చునని చెప్పారు. అందుకే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో కరోనా వైరస్ పేషెంట్లను వెంటిలేటర్‌‌‌పై పెట్టేందుకు వైద్యులు కాస్త సమయం తీసుకుంటున్నారని చెప్పారు. పేషెంట్ పరిస్థితి అత్యంత విషమించిన పరిస్థితుల్లో.. ఆఖరి ప్రయత్నంగా వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.

ఇంతకుముందులా కాదు.. పరిస్థితి విషమిస్తేనే వెంటిలేటర్..

ఇంతకుముందులా కాదు.. పరిస్థితి విషమిస్తేనే వెంటిలేటర్..

ఇంతకుముందు క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స అందించే పేషెంట్లను వీలైనంత త్వరగా వెంటిలేటర్‌పై పెట్టేవారని.. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయిందని అన్నారు. 'వీలైనంత ఎక్కువగా వారికి ఆక్సిజన్ అందిస్తాం. శ్వాస సమస్య విషమిస్తే తప్ప కృత్రిమ ట్యూబ్స్ ద్వారా వారికి ఆక్సిజన్ అందించం.' అని తెలిపారు.

వెంటిలేటర్లపై చికిత్స పొందుతున్నవారిలో ఎక్కువమంది మృత్యువాతపడటంపై క్లెవెలాండ్ క్లినిక్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో సేవలందించే డా.హసన్ ఖౌలీ భిన్నంగా స్పందించారు. కరోనా వైరస్ తీవ్రత వల్లే పరిస్థితి విషమించి వారు చనిపోతున్నారని.. వెంటిలేటర్లకు వారి మరణాలకు సంబంధం లేదన్నారు. వెంటిలేటర్లు వారికి ఎలాంటి హాని తలపెట్టట్లేదన్నారు.

వెంటిలేటర్‌ ట్రీట్‌మెంట్‌లో సైడ్ ఎఫెక్ట్స్..

వెంటిలేటర్‌ ట్రీట్‌మెంట్‌లో సైడ్ ఎఫెక్ట్స్..

అయితే మెకానికల్ వెంటిలేటర్స్ కారణంగా పేషెంట్‌లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వైద్యులు చద్దా,ఖౌలీ తెలిపారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందే కోవిడ్-19 పేషెంట్లు.. అటు వైరస్ లోడ్,ఇటు సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందన్నారు. గత నెల వెంటిలేటర్‌పై ఆరు రోజుల పాటు చికిత్స పొందిన ఓ న్యూయార్క్ న్యాయవాది దీనిపై వాషింగ్టన్ పోస్టులో ఒక ఆర్టికల్ రాస్తూ.. అది తనను చాలా భయపెట్టిందన్నారు.

నిజానికి తాను ఆసుపత్రిలో చేరిన తర్వాత.. వీలైనంతవరకు వెంటిలేటర్ ట్రీట్‌మెంట్‌కు వెళ్లకపోవడమే మంచిదని తన తండ్రి సూచించినట్టుగా తెలిపారు. ఒకసారి వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటే.. దాని ద్వారా తలెత్తే సమస్యలు ఎప్పటికీ వెంటాడుతాయని చెప్పినట్టు పేర్కొన్నారు.వెంటిలేటర్‌‌పై చికిత్సతో కోలుకున్నప్పటికీ.. శ్వాసకోశ సమస్యలు మాత్రం వెంటాడుతున్నాయని ఆమె తెలిపారు. ఇంతకుముందు తాను మారథాన్‌లలో పాల్గొనేదాన్ని అని.. ఇప్పుడు కనీసం తన గదిలోనే అటు,ఇటూ నడవలేక ఆయాస పడుతున్నానని చెప్పారు. తనను వీల్ చైర్‌లో కూర్చోబెట్టి తన భర్త బయటకు తీసుకెళ్తే తప్ప స్వచ్చమైన గాలి కూడా పీల్చుకోలేకపోతున్నానని చెప్పుకొచ్చారు.

Recommended Video

కండోమ్ చిరిగింది.. కాపురంలో చిచ్చు పెట్టింది
వెంటిలేటర్ ట్రీట్‌మెంట్ తర్వాత తలెత్తే సమస్యలు

వెంటిలేటర్ ట్రీట్‌మెంట్ తర్వాత తలెత్తే సమస్యలు

శ్వాస తీసుకోవడంలో సమస్య తీవ్రమైనప్పుడు పేషెంట్‌కు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తారు. వెంటిలేటర్ ట్యూబ్స్‌ను గొంతులోకి పంపించి ఆక్సిజన్ అందిస్తారు. అయితే ఉదర భాగంలోని శ్వాస అందే కండరాలు దీనివల్ల బలహీనపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా వెంటిలేటర్ చికిత్స అనంతరం సొంతంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు.

English summary
It should be mentioned that many patients who go under ventilators die and survivors usually face life-long breathing issues, caused either by the machine or the damage done by the virus. The problem is the longer people will live under such life support, the more likely they are to suffer complications related to the machine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X