ఎస్ఎంఎస్‌తో ఆధార్ లింక్: ఆ ప్రకటనలతో జాగ్రత్త, మాకేం తెలియదు: ఎల్ఐసీ
ఆధార్‌ను ఎల్ఐసీకి లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్‌తో పాలసీ నెంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే ఎల్ఐసితో ఆధార్‌ను లింక్ చేసుకోవాలంటూ వచ్చే ఎస్ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని
న్యూఢిల్లీ: ఆధార్‌ను ఎల్ఐసీకి లింక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆధార్‌తో పాలసీ నెంబర్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అయితే ఎల్ఐసితో ఆధార్‌ను లింక్ చేసుకోవాలంటూ వచ్చే ఎస్ఎంఎస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎల్ఐసీ హెచ్చరించింది.
ఎల్ఐసీ పాలసీలను కూడ ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఐఆర్‌డిఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎల్ఐసి పాలసీదారులు
ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఎల్ఐసీ పాలసీలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలనే విషయమై కొందరు తమ జేబులు నింపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఐసీ పాలసీదారులకు తెలియకుండానే వారి సొమ్మును కాజేసేందుకు మోసపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్ఐసీ హెచ్చరించింది.

ఆ ఎస్ఎంఎస్‌లు నమ్మొద్దు
ఎల్‌ఐసీ పాలసీదారులా? మీ పాలసీని ఆధార్‌తో ఎస్సెమ్మెస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలని మీ మొబైల్‌కు సందేశమేదైనా వచ్చిందా? ఇటీవల ఎస్సెమ్మెస్ ద్వారా ద్వారా పాలసీని ఆధార్‌తో జత చేసుకోవాలంటూ వస్తున్న సందేశాలపై ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ స్పందించింది. అలాంటి సందేశాలు నమ్మొద్దు అంటూ ఒక ప్రకటన జారీ చేసింది.ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకొనే ప్రక్రియను ప్రారంభించలేదన్నారు.

సోషల్ మీడియాలో ప్రచారం
ఎల్ఐసి పాలసీని ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతున్న విషయాన్ని ఎల్ఐసీ గుర్తించింది. ఎల్‌ఐసీ లోగోతో కూడిన ఓ సందేశం విస్తృతంగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. తమ పాలసీకి ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలనుకునే వారు అందులో ఉన్న నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపాలన్నది దాని సారాంశం. ఈ తరహ ప్రచారాన్ని చూసి మోసపోకూడదని ఎల్ఐసీ ప్రకటించింది.

ఆ ప్రచారంతో ఎల్ఐసీకి సంబంధం లేదు
ఎస్ఎంఎస్ ద్వారా ఎల్ఐసీ పాలసీని ఆధార్‌తో లింక్ చేస్తామని ఎస్ఎంఎస్ వస్తే జాగ్రత్త పడాలని కస్టమర్లను హెచ్చరించింది ఎస్ఎంఎస్. తమ ఖాతాదారుల సొమ్ముకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో తాము ఈ ప్రకటనను జారీ చేస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది.

వెబ్‌సైట్‌లో ఎస్ఎంఎస్ ద్వారా ప్రకటిస్తాం
ఎస్సెమ్మెస్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం చేసుకునే సదుపాయమేదీ ప్రస్తుతానికి కల్పించలేదని ప్రకటించింది ఎల్ఐసీ. ఒక వేళ ఆ సదుపాయాన్ని కల్పించినట్లయితే ఆ వివరాలను తమ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని తెలిపింది. మీ వ్యక్తిగత వివరాలు పంచుకోవాల్సిన వచ్చినప్పుడు ముందుగా స్థానిక ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications