1965 పాకిస్తాన్ యుద్ధ హీరో అర్జన్ సింగ్ కన్నుమూత, ఫైవ్ స్టార్ మార్షల్

Posted By:
Subscribe to Oneindia Telugu
  Arjan Singh : Nation pays tributes to India’s Sole 5-Star Rank IAF Officer | Oneindia Telugu

  న్యూఢిల్లీ: భారత వైమానికదళ మార్షల్ అర్జన్ సింగ్ (98) కన్నుమూశారు. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆర్మీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. రాత్రి 7.47 గం.లకు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

  ఆయ‌న 1965 భార‌త్‌, పాకిస్థాన్ యుద్ధ స‌మ‌యంలో ఐఏఎఫ్ చీఫ్‌గా సేవ‌లు అందించారు. ఆయ‌న అందించిన సేవ‌ల‌కు గుర్తుగా 2016లో పశ్చిమ బెంగాల్‌లోని ప్ర‌న‌గ‌ర్ బేస్‌కి ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్ అర్జ‌ున్ సింగ్ అని పేరు పెట్టారు.

  ఫైవ్ స్టార్ ఉన్న ఏకైక మార్షల్

  ఫైవ్ స్టార్ ఉన్న ఏకైక మార్షల్

  ఆయ‌న ఏప్రిల్ 15, 1919లో ల్యాల్లాపూర్ (నేటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో) జ‌న్మించారు. 1964-1969 మధ్య భారత వైమానిక దళ అధిపతిగా ఉన్న ఆయన ఫైవ్ స్టార్స్ ర్యాంకు ఉన్న ఏకైక మార్షల్‌ కావడం గమనార్హం. 1965 భారత్‌-పాక్‌ యుద్ధంలో అర్జన్‌ వీరోచితంగా పోరాడారు. యువ వైమానిక దళానికి నాయకత్వం వహించారు.

  ఆ యుద్ధంలో పాక్ వైమానిక దళాన్ని చిత్తు చేశారు

  ఆ యుద్ధంలో పాక్ వైమానిక దళాన్ని చిత్తు చేశారు

  తన చాతుర్యం, ఎవరికీ సాధ్యమవ్వని దార్శనికత, ముందు చూపుతో పాకిస్తాన్ వైమానిక దళాన్ని చిత్తు చేశారు. అమెరికా యుద్ధ విమానాలతో పోరాడుతున్న పాకిస్తాన్‌ను తన అసమాన ధైర్య సాహసాలతో తుత్తునీయులు చేశారు. అప్పటికి ఆయన వయసు 44 ఏళ్లు.

  వైమానిక దళంలోకి ఆధునాత సామాగ్రి

  వైమానిక దళంలోకి ఆధునాత సామాగ్రి

  అర్జన్‌ సింగ్‌ వైమానిక దళ అధిపతిగా ఉన్నప్పుడే సూపర్‌ సోనిక్‌, వ్యూహాత్మక, తాంత్రిక యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు ఇంకా అధునాతన సామగ్రి వైమానిక దళంలోకి చేరాయి. అర్జన్‌ సింగ్‌ పందొమ్మిదేళ్ల వయస్సులోనే రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కళాశాల నుంచి పట్టా పుచ్చుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ఎన్నో సన్మానాలు చేసింది. పురస్కారాలు బహూకరించింది.

  వద్దంటున్నా సెల్యూట్ చేసేందుకు ప్రయత్నించారని మోడీ

  అర్జన్‌ సింగ్‌ మృతిపట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌, త్రివిధ దళాధిపతులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కొన్నాళ్ల కిత్రం ఆయన్ను కలిసినప్పటి చిత్రాలను మోడీ పంచుకున్నారు. అస్వస్థతో ఉన్నా, తాను వద్దని చెప్పినా, తనకు సెల్యూట్‌ చేయడానికి ప్రయత్నించారని, అది ఆయన సైనిక క్రమశిక్షణకు మారుపేరని మోడీ పేర్కొన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  Read in English: Arjan Singh dies at 98
  English summary
  Marshal of the Indian Air Force Arjan Singh died at 7.47 pm on Saturday after suffering a heart attack. Singh, 98 India's oldest, five-star ranked air force officer, was admitted to the Army's Research and Referral hospital this morning.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X