పాక్‌కు షాకిచ్చిన భారత్: సాంబా సెక్టార్‌లో 12 మంది పాక్ రేంజర్ల హతం

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీనగర్: ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేసి భారత జవాన్ ప్రాణాలు తీసుకొన్న పాకిస్తాన్‌కు భారత్ గట్టి బుద్ది చెప్పింది. గురువారం నాడు 12 మంది పాక్ రేంజర్లను బిఎస్ఎప్ జవాన్లు సాంబా సెక్టార్‌లో మట్టు బెట్టారు.

50 ఏళ్ళ భారత జవాన్ ఆర్పీ హజ్రా పాక్ సైనికుల దాడిలో బుదవారం నాడు చనిపోయాడు. పాక్ సైనికులు నిబంధనలను ఉల్లంఘించి ఈ దాడకి దిగాయి.దీంతో భారత జవాన్లు తమ విశ్వరూపాన్ని చూపారు.

Army Avenges BSF Jawan's Death, Kills 12-15 Pakistani Rangers, Destroys 2 Posts Near LoC

పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసి డజను మందికి పైగా పాక్ రేంజర్లను హతమార్చాయి. జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్‌లో నిన్న పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరపడంతో బీఎస్ఎఫ్ దళానికి చెందిన ఆర్పీ హజ్రా ప్రాణాలు కోల్పోయారు.

50 ఏళ్ల ఆయన తన జన్మదిన వేడుకల్లోనే హజ్రా చనిపోయాడు. భీకర కాల్పులతో పాకిస్తాన్ సైనిక పోస్టులపై విరుచుకుపడ్డారు.. రెండు పాకిస్తానీ మోర్టార్ పొజిషన్లను పసిగట్టి రాత్రికి రాత్రే నేలకూల్చాయి. బీఎస్ఎఫ్ కాల్పుల్లో దాదాపు 12 నుంచి 15 మంది వరకు పాక్ సైనికులు హతమైనట్టు సమాచారం.

తొలుత తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగిన పాకిస్తాన్.. క్రమంగా మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించడం మొదలు పెట్టిందని బిఎస్ఎస్ అధికారులు ప్రకటించారు.
బుధవారం రాత్రి రెండు పాకిస్తానీ మోర్టార్ పొజిషన్లను గుర్తించి కూల్చివేసినట్టు చెప్పారు. తమ దాడిలో సుమారు 12 మందికి పైగా పాక్ రేంజర్లు చనిపోయారని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Border Security Force on Thursday killed nearly a dozen of Pakistani Rangers to avenge the killing of its jawan in ceasefire violation on the international border in Jammu and Kashmir’s Samba district on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి