వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్ర కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్‌, ముగ్గురు జవాన్లు మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ-కాశ్మీరులో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. పంపోర్ వద్ద శనివారం శ్రీనగర్-జమ్మూ రహదారిలో సిఆర్‌పిఎఫ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడటంతో ఆర్మీ కెప్టెన్ తోపాటు ముగ్గురు జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతిచెందారు. మరో పది మంది గాయపడ్డారు.

దాడి అనంతరం ఉగ్రవాదులు అక్కడికి సమీపంలోని ఇడిఐ (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్)లోకి చొరబడటంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. దీంతో అక్కడ ఇరు పక్షాల హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. అయితే అంతకుముందు స్థానిక పోలీసులు అప్రమత్తమై ఆ ప్రభుత్వ కార్యాలయం నుంచి సిబ్బందిని, సామాన్య పౌరులను ఖాళీ చేయించి ఎవరూ నిర్బంధానికి గురికాకుండా నిరోధించగలిగారని రాష్ట్ర డిజిపి కె రాజేంద్ర పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశారు.

కాగా, ప్రస్తుతం ఆ భవనంలో ఐదుగురు ఉగ్రవాదులు నక్కినట్లు ప్రత్యక్ష సాక్షులు, భద్రతా సిబ్బంది చెబుతున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో 15 కార్ప్స్ సైనిక ప్రధాన కార్యాలయం ఉంది. దీంతో అక్కడి సైనిక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రదేశానికి చేరుకుని ఉగ్రవాదుల ఏరివేతలో స్థానిక పోలీసులకు, సిఆర్‌పిఎఫ్ జవాన్లకు సాయం అందిస్తున్నారు.

Army captain, 3 CRPF jawans killed in J&K encounter

ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్ మృతి

జమ్ముూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై పాంపోర్‌ సమీపంలో ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. తాజాగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్‌ మృతి చెందారు.

పాంపోర్‌లోని కేంద్ర రిజర్వు పోలీసు దళం(సీఆర్‌పీఎఫ్‌) వాహన శ్రేణిపై ముష్కరులు శనివారం నుంచి విరుచుపడుతున్నారు. శనివారం జరిగిన ఈ దాడిలో ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడు మృతిచెందగా, మరో 9మందికి గాయాలపాలయ్యారు. ఆదివారం కూడా ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.

English summary
A captain of the Indian Army, two personnel of the Central Reserve Police Force (CRPF) and one civilian have been killed in an encounter with terrorists in Jammu and Kashmir's Pampore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X