పాక్ కాల్పులు: అర్మీ కెప్టెన్ సహా నలుగురు మృతి
జమ్మూ: జమ్మూ కాశ్మీరులోని రాజౌరి సరిహద్దు ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సైనికులు మరణించారు. మృతుల్లో ఆర్మీ కెప్టెన్, ముగ్గురు జవాన్లు ఉన్నారు.
ఏ మాత్రం రెచ్చగొట్టకుండానే పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. ఆదివారం తెల్లవారు జామున సరిహద్దు రేఖ వెంబడి ఉన్న పూంచ్, రాజౌరీ జిల్లాలోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత్ సైన్యం దీటుగా స్పందించింది. మూడు రోజుల వ్యవధిలో పాకిస్తాన్ కాల్పులు జరపడం ఇది రెండోసారి.
పాకిస్తాన్ కాల్పుల్లో మరణించినవారిని కెప్టెన్ కపిల్ కుందు, రైఫిల్‌మెన్ రామావతార్, సుభమ్ సింగ్, హవిల్దార్ రోషన్ లాల్‌లుగా గుర్తించారు. మరో నలుగురు గాయపడ్డారు.
జనవరి 18 నుంచి 22వ తేదీ మధ్య నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో దాదాపు 13 మంది మరణించారు. రాజౌరీ, పూంఛ్, జమ్ము, సాంబా, కథువా జిల్లాల్లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తరుచుగా కాల్పులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లోని దాదాపు 300 పాఠశాలలను గత నెలలో వారు రోజులు పాటు మూసివేశారు.












Click it and Unblock the Notifications