వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్మీ చీఫ్ నరవాణే లేహ్ పర్యటన... భారత్ చైనా మధ్య ఏం జరుగుతోంది?

|
Google Oneindia TeluguNews

లడాఖ్: భారత్ చైనా దేశాల మధ్య వాతావరణం వేడెక్కుతోంది. అన్ని నిబంధనలు ఉల్లఘించి భారత భూభాగంలోకి చొరబడేందుకు డ్రాగన్ కంట్రీ యత్నిస్తోంది. జూన్ 15న జరిగిన గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా ఆగష్టు 29 మరియు ఆగష్టు 30 మధ్య రాత్రిలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలు భారత్‌ పాంగాంగ్ సరస్సు వద్ద స్టేటస్ ఉల్లంఘనలకు పాల్పడేందుకు ప్రయత్నించగా భారత బలగాలు అడ్డుకున్నాయి. ఈ మేరకు రక్షణశాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

తాజాగా తూర్పు లడాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే దక్షిణ పాంగాంగ్ సరస్సు వద్ద మెజార్టీ ప్రాంతాలను భారత్ తన అధీనంలోకి తెచ్చుకుంది. అంతేకాదు చైనా బలగాలను ధీటుగా ఎదుర్కొంటోంది. రెండు దేశాల సైనికులు ఫైరింగ్ రేంజ్ దూరంలో మోహరించి ఉన్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒక వైపు చర్చలు అని చెబుతూనే మరో వైపు డ్రాగన్ కంట్రీ తన కుటిల బుద్ధిని ప్రదర్శించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితి ఎలాగుందో సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే లేహ్‌కు చేరుకున్నారు. అక్కడ భద్రతాపరమైన సమీక్షను నిర్వహిస్తారు. ఆగష్టు 29-30వ తేదీల మధ్య జరిగిన పరిణామాలను ఆర్మీ ఉన్నతాధికారులు నరవాణేకు వివరిస్తారు. ఇక వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలు చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించిన సమయంలో అడ్డుకుని ధైర్య సాహసాలను ప్రదర్శించిన భారత జవాన్లను ఆయన ఆర్మీ చీఫ్ అభినందిస్తారు. అనంతరం సరిహద్దు వద్ద చైనా బలగాల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా..వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీకి సూచించనున్నట్లు తెలుస్తోంది.

Army Chief MM Naravane visits Leh amid the tensions between India and China at LAC

ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే లేహ్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. వాస్తవాధీన రేఖ వద్ద ఏప్రిల్ నెలలో స్టేటస్ కోను తరుచూ ఉల్లంఘిస్తోంది చైనా. ఈ క్రమంలోనే జూన్ 15వ తేదీన భారత్ చైనా బలగాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో 20 మంది జవాన్లు అమరులయ్యారు. చైనా బలగాలపై కూడా భారత్ జవాన్లు ఎదురుదాడి చేయడంతో వారు కూడా చాలామంది మృతి చెందారు. అయితే చైనా ఎక్కడే కానీ అధికారికంగా ప్రకటించకుండా చైనా సైనికుల మృతుల వివరాలను దాచి ఉంచింది.

English summary
Army Chief MM NAravane visited Leh amid the tensions between India and China at LAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X