వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Army helicopter Crash:హెలికాఫ్టర్ లో 14 - 11 మంది దుర్మరణం- బిపిన్ రావత్ పై ఉత్కంఠ- కాసేపట్లో రాజ్ నాథ్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

తమిళనాడులోని కూనూర్ లో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాద వివరాలు క్రమంగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రమాదాన్ని ఎయిర్ ఫోర్స్ ధృవీకరించగా.. ఇప్పుడు తాజాగా అందులో 14 మంది ప్రయాణించినట్లు ప్రకటించింది. ఇందులో 11 మృతదేహాల్ని గుర్తించారు. వాస్తవ పరిస్ధితి తెలుసుకునేందుకు కూనూర్ హెలికాఫ్టర్ ప్రమాద ఘటనా స్ధలికి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాటు పలువురు మంత్రులు, తమిళనాడు సీఎం స్టాలిన్ కాసేపట్లో వెళ్లనున్నారు.

హెలికాఫ్టర్ లో 14 మంది

హెలికాఫ్టర్ లో 14 మంది

ఇవాళ తమిళనాడులోని కూనూర్ లోని నీలగిరి కొండల్లో ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాఫ్టర్ లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులికా రావత్ తో పాటు మొత్తం 14 మంది ప్రయాణించినట్లు ఆర్మీ ధృవీకరించింది. తమిళనాడులోని వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీలో జనరల్ రావత్ ప్రసంగానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపింది. ప్రమాదం, తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్ని ఆర్మీ వర్గాలు కొద్ది సేపటి క్రితం వెల్లడించాయి. ఇందులో పలు కీలక వివరాలు ఉన్నాయి.

 11 మంది దుర్మరణం

11 మంది దుర్మరణం

ప్రమాదానికి గురైన రష్యా మేడ్ ఎంఐ 17 వీ65 హెలికాఫ్టర్ లో ప్రయాణించిన 14 మందిలో ఇద్దరు దాన్ని నడపగా మరో 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 11 మంది ప్రమాదంలోనే చనిపోయినట్లు గుర్తించారు. మిగతా వారిని తీవ్ర గాయాలతో స్ధానిక వెల్లింగ్టన్ మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దాదాపు 80 శాతం గాయాలపాలైనట్లు ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. వీరిలో పలువురి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆర్మీ ఆస్పత్రి నుంచి రక్షణశాఖ వర్గాలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ కేంద్ర కేబినెట్ భేటీలోపాల్గొంటున్న ప్రధాని, మంత్రులకు తెలియచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఘటనాస్ధలికి స్ధానికులు వెళ్లలేని పరిస్ధితి

ఘటనాస్ధలికి స్ధానికులు వెళ్లలేని పరిస్ధితి

హెలికాఫ్టర్ ప్రమాదం జరగిన తర్వాత అక్కడికి స్ధానికంగా ఉన్న వారు వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది. స్ధానికంగా ఉంటున్న కొండ ప్రాంతంలో నివసిస్తున్న కొందరు ప్రమాదాన్ని గుర్తించి అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించినా సాధ్యంకాలేదని తెలిసింది. వారు కనీసం మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించినా కుదరలేదని తెలిసింది. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించగా.. వారు చేరుకున్నారు. ఆ తర్వాత రోప్ ల సాయంతో వారు కొండలపై నుంచి దిగి ప్రమాదస్ధలికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదస్ధలికి రాజ్ నాథ్, స్టాలిన్

ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాద స్ధలికి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇతర మంత్రులతో కలిసి వెళ్లనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న కేబినెట్ భేటీలో పాల్గొంటున్న రాజ్ నాథ్ సింగ్ సాయంత్రం ఘటనా స్ధలికి వెళ్లనున్నారు. ఆయనతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వెళ్తారని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడులోని నీలగిరి కొండ ప్రాంతంలో జరిగిన ఘటన కావడంతో అక్కడికి వెళ్లడం కూడా కష్టంగానే ఉంది. దీంతో అధికారులు వీఐపీల రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.

కాసేపట్లో పార్లమెంటులో రాజ్ నాథ్ ప్రకటన


కూనూర్ లో హెలికాఫ్టర్ ప్రమాదంపై రక్షణమంత్రి రాజ్ నాధ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేయనున్నారు ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో పార్లమెంటుకు ప్రభుత్వం ప్రకటన చేయాల్సిన పరిస్ధితి ఉంది. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్ర కేబినెట్ భేటీ ముగియగానే పార్లమెంట్ కు వెళ్లి రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో హెలికాఫ్టర్ ప్రమాదంపై కీలక ప్రకటన చేయబోతున్నారు. అలాగే సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ బతికే ఉన్నారా లేదా అన్న దానిపై కూడా రాజ్ నాథ్ ప్రకటన చేయనున్నారు. దీంతో రాజ్ నాథ్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.య

English summary
army has annouced that total 14 people are on board in crashed helicopter in tamilnadu while four deadbodies have so far recovered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X